గతేడాది ఐపీఎల్ వేలంలో బెంగళూరు జట్టు ఆస్ట్రేలియా ఆటగాడు ఫించ్‌ను దక్కించుకుంది. ఇప్పుడు అతడిని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. గత సీజన్ వరకు ఆర్సీబీ ఓపెనర్లుగా పార్థివ్ పటేల్, విరాట్ కోహ్లీ వచ్చారు. ఇప్పుడు ఆసీస్ తరఫున ఓపెనర్‌గా రాణిస్తున్న ఆరోన్ ఫించ్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో బెంగళూరు టాప్ ఆర్డర్ మారొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరు త్యాగం చేస్తారో?
ఫించ్ అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఇతడిని జట్టులోకి తీసుకుంటే పార్థివ్, కోహ్లీలలో ఒకరు తమ స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఫించ్‌ను ఎవరి స్థానంలో దింపాలనే విషయమై ఆర్సీబీ కూడా మల్లగుల్లాలు పడుతుందట.
అది రహస్యం!
ఫించ్ రాకతో ఆర్సీబీ బ్యాటింగ్ టాప్ ఆర్డర్లో మార్పు రానుందా? అనే ప్రశ్నను జట్టు డైరెక్టర్ మైక్ హెసన్ స్పందించాడు. స్టార్ బ్యాట్స్‌మెన్స్ కోహ్లీ, ఫించ్లలో ఎవరు ఒకరు బరిలో దిగుతారా.. లేదా ఇద్దరూ కలిసి ఓపెనింగ్ చేస్తారా? అనే ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని అన్నాడు. ఎందుకంటే అది తమ వ్యూహమని తెలిపాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈ వేదికగా ప్రస్తుత సీజన్ జరగనుంది.