ETV Bharat / sports

'సీనియర్​ ఆటగాడిగా నాపై ఒత్తిడి లేదు'

author img

By

Published : Sep 9, 2020, 7:26 PM IST

Updated : Sep 9, 2020, 8:13 PM IST

సీనియర్​ ఆటగాడిగా ఉన్నప్పుడు.. జట్టుకు మరింత బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నాడు టీమ్​ఇండియా పేసర్​ భువనేశ్వర్​ కుమార్​. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్​లో సన్​రైజర్స్​ తరఫున ఆడనున్నాడు.

Bhuvneshwar
భువనేశ్వర్

సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టుకు తాను సీనియర్​ బౌలర్​ కావడం వల్ల.. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్​లో మరింత బాధ్యత వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా పేసర్​ భువనేశ్వర్​ కుమార్. ఈ విషయంలో తనకు ఎటువంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్​లో తమ జట్టు గెలిచేందుకు తాను కృషి చేస్తానని చెప్పాడు.

Bhuvneshwar
సన్​రైజర్స్​ టీమ్​తో భువి

" ప్రస్తుతం నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. ఎందుకంటే.. జట్టు ఎప్పుడూ ఒక్క ఆటగాడిపైనే ఆధారపడదు. నేను సీనియర్​ ఆటగాడిని కాబట్టి మరింత జాగ్రతగా ఉండాలని అనుకుంటా."

భువనేశ్వర్​ కుమార్​, టీమ్ఇండియా క్రికెటర్​

ఇప్పటివరకు హైదరాబాద్​ తరఫున 96 మ్యాచ్​లు ఆడిన భువీ.. 109 వికెట్లు తీశాడు.

Bhuvneshwar
సన్​రైజర్స్​ కెప్టెన్​ వార్నర్​తో భువనేశ్వర్​

సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ జట్ల మధ్య పోరుతో టోర్నీ ప్రారంభం కానుంది. నవంబరు 10న లీగ్​ ముగియనుంది.

Last Updated : Sep 9, 2020, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.