ETV Bharat / sports

'ధోనీలా మంచి ఫినిషర్​ కావాలనుంది' - dhoni news

దక్షిణాఫ్రికా బ్యాట్స్​మన్​ డేవిడ్​ మిల్లర్ టీమ్​ఇండియా మాజీ సారథి​ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాహీ బ్యాటింగ్​ శైలి అద్భుతమని.. అతనిలా ఆడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

IPL 2020
ధోనీ
author img

By

Published : Sep 14, 2020, 5:04 PM IST

Updated : Sep 14, 2020, 8:20 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ పరుగులు సాధించే సామర్థ్యం తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందని దక్షిణాఫ్రికా బ్యాట్స్​మన్​ డేవిడ్​ మిల్లర్​ అన్నాడు. ధోనీలా ఆడటమే తన లక్ష్యమని ఓ స్పోర్ట్స్​ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ఏడాది ఐపీఎల్​లో మిల్లర్​.. రాజస్థాన్​ రాయల్స్​కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

dhoni
ధోనీ కెరీర్​లో ఘనతలు

"ధోనీ వ్యవహార శైలి నిజంగా అద్భుతం. కచ్చితంగా నేను అతనిలాగే బ్యాటింగ్​ చేయాలనుకుంటా. అతనిలాగే మ్యాచ్​లను అద్భుతంగా ముగించాలనిపిస్తుంది. టెక్నిక్​ పరంగా ప్రతి ఒక్క ఆటగాడికి సొంత శైలి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఫినిషర్లలో ధోనీ ఒకరని కచ్చితంగా చెప్పగలను."

-డేవిడ్​ మిల్లర్​, దక్షిణాఫ్రికా క్రికెటర్​

కాగా జట్టులో ఇప్పటివరకు తనకు ఎటువంటి ప్రత్యేక స్థానాన్ని కేటాయించలేదని మిల్లర్​ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రాక్టీసులో ఉన్న ఆటగాళ్లంతా.. లీగ్​ కోసం బాగా కష్టపడుతున్నారని తెలిపాడు.

"రాజస్థాన్​ రాయల్స్​ కోచ్​ ఆండ్రూ మెక్​డొనాల్డ్​తో ఇంకా ఎటువంటి చర్చలు జరపలేదు. కాబట్టి, ప్రస్తుతం ప్రాక్టీసుపై దృష్టి పెడుతున్నా. గత కొన్ని నెలలుగా క్రికెట్​కు దూరంగా ఉన్నా. ఇప్పుడు ఫిట్​నెస్​ను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. జట్టు సభ్యుల స్థానాలు, ప్రణాళికలపైనా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు" అని మిల్లర్​ తెలిపాడు.

సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా ఐపీఎల్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​- సీఎస్కే జట్లు తలపడనున్నాయి.

Last Updated : Sep 14, 2020, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.