ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ వేలంపాట డిసెంబర్ 19న జరగనుంది. కోల్‌కతా వేదికగా జరగనున్న ఈ వేలానికి.. 997 మంది పేర్లు నమోదు చేసుకోగా వారిలో 332 మందినే ఫైనల్ చేశారు టోర్నీ నిర్వాహకులు. ఇందులో నుంచి 73 మందిని ఎంపిక చేసుకోనున్నాయి 8 ఫ్రాంచైజీలు.
కనీస ధర 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉండగా.. భారతీయ ఆటగాళ్లలో ఒక్కరూ రెండు కోట్ల లిస్టులో పేరు సంపాదించలేకపోయారు. ఇప్పటివరకు ఈ లీగ్‌లో ఆడని దేశీయ, విదేశీ ఆటగాళ్లు రూ. 40 నుంచి 20 లక్షల విభాగాల్లో నిలిచారు.
రూ.2 కోట్ల జాబితాలో...
ఇందులో ఏడుగురు విదేశీ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. క్రిస్ లిన్, కమిన్స్, మ్యాక్స్‌వెల్, స్టెయిన్, హెజిల్వుడ్, మాథ్యూస్, మిచెల్ మార్ష్ స్థానం సంపాదించుకున్నారు.
రూ. 1.5 కోట్ల జాబితాలో...
భారత్ నుంచి ఊత్తప్ప మాత్రమే ఈ లిస్టులో ఉన్నాడు. మోర్గాన్, రాయ్, మోరిస్, వోక్స్, జంపా, షాన్ మార్ష్, డీ విల్లే, రిచర్డ్సన్, కైల్ అబాట్ చోటు దక్కించుకున్నారు.
రూ. 1 కోటి జాబితాలో...
ఈ జాబితాలో భారత ఆటగాళ్లు యూసఫ్ పఠాన్ సహా ఉనద్కత్, చావ్లా నిలిచారు. వీరితో పాటు విదేశీ ఆటగాళ్లు ఫించ్, కరన్, కల్టర్‌నైల్, సౌథీ, టై, గప్తిల్, లూయిస్,మున్రో, స్టోయినిస్, ముస్తాఫిజుర్, టీ బాంటన్, అలెక్స్ హేల్స్, రోసో, సామ్ కరన్, ఆష్టన్ అగర్, హెన్రిక్స్, డీ షార్ట్, ప్లంకెట్, పాటిన్సన్, తిసార పెరెరా ఉన్నారు.
రూ. 75 లక్షల జాబితాలో...
ఈ విభాగంలో ఒక్క భారతీయుడికి చోటు దక్కలేదు. గ్రాండ్‌హోమ్, ముష్ఫికర్ రహీం, సౌథీ, మిల్లర్, బెన్ కటింగ్, కోరె అండర్సన్, హోల్డర్, జోర్డాన్, ఎస్ అబాట్, సిమ్మన్స్, డే లాంగే, మహ్మదుల్లా, వైస్, టర్నర్, క్రిస్టియన్ జాబితాలో ఉన్నారు.
రూ. 50 లక్షల జాబితాలో...
ఇందులోనూ ఒక్క ఇండియన్ ప్లేయర్‌కు చోటు లభించలేదు. విదేశీ ఆటగాళ్లు హెట్మెయిర్, ఇంగ్రామ్, కారే, హోప్, క్లాసన్, కుశాల్ పెరెరా, కాట్రెల్, నీషమ్, పెహ్లుక్వాయో, బొపారా, హసరంగ, కరుణరత్నె, టీ థామస్, ఏ జోసెఫ్, ఎమ్ ఉడ్, బ్రాత్‌వైట్ ఉన్నారు.
13వ సీజన్ ఐపీఎల్ వేలంపాటలో 186 మంది భారత ఆటగాళ్లు, 143 మంది విదేశీ, 3 సంయుక్త దేశాల క్రికెటర్లు వేలంలో పాల్గొననున్నారు.