వరుసగా సిరీస్‌లు గెలుస్తూ.. టీమిండియా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మన బౌలర్లు. అయితే భారత్ ప్రస్తుత బౌలింగ్ కన్నా ఆస్ట్రేలియా బౌలింగే అత్యుత్తమంగా ఉందని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
"భారత స్పిన్నర్లు ఆసీస్ గడ్డపై ఇబ్బంది పడతారు. వారి కన్నా ఆసీస్ బౌలర్ నాథన్ లైయన్‌కు ఇక్కడ మంచి రికార్డు ఉంది. అలాగే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుంది. అది నాకెంతో ఇష్టం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే భారత్ కంటే ఆసీస్ జట్టే మెరుగ్గా ఉంది" - రికీ పాంటింగ్, ఆసీస్ మాజీ కెప్టెన్
బుమ్రా, షమీలతో భారత పేస్ విభాగం పటిష్ఠంగా తయారైందని తెలిపాడు పాంటింగ్
"భారత జట్టు అద్భుతంగా ఉంది. బుమ్రా, షమీ కొన్నేళ్లుగా బాగా రాణిస్తున్నారు. వారికి ఉమేశ్‌యాదవ్, ఇషాంత్ శర్మ జత కలిశారు. దీంతో టీమిండియా బౌలింగ్ పటిష్టంగా మారింది. ఇక అశ్విన్, జడేజాలను కలుపుకొంటే.. ఆ బౌలింగ్ అటాక్ మరింత బాగుంటుంది’ అని వివరించాడు." -రికీ పాంటింగ్, ఆసీస్ మాజీ కెప్టెన్
ఇటీవల బంగ్లాదేశ్‌ను 2-0తో మట్టికరిపించిన టీమిండియా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 360 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా పాకిస్థాన్‌పై 2-0తో టెస్టు సిరీస్ నెగ్గిన ఆసీస్ 176 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: పైన్‌కు సాయం చేద్దామనుకున్నా అంతే: స్మిత్