ఆసీస్ గడ్డపై టీమిండియా చిరస్మరణీయ టెస్టు సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్... తన తండ్రికి నివాళి అర్పించారు. సీరిస్ ముగిసిన అనంతరం హైదరాబాద్ చేరుకున్న సిరాజ్... ముందుగా తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
కుమారుడు జాతీయ జట్టుకు ఆడాలని ఎన్నో కలలు కన్న తండ్రి మహ్మద్ గౌస్... సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే... అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న సిరాజ్... క్వారంటైన్ నిబంధనలు, జాతీయ జట్టుకు ఆడాలన్న తపనతో ఆస్ట్రేలియా పర్యటనలోనే కొనసాగారు. తండ్రి మరణాన్ని పంటి బిగువున భరించి... కంగారులను హడలెత్తించారు.
ఇదీ చూడండి: శంషాబాద్లో సిరాజ్, విహారిలకు ఘనస్వాగతం