అది 2015.. బెంగళూరులో భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు జరుగుతోంది. క్రీజులోకి ఓ బ్యాట్స్‌మన్ వచ్చాడు. స్టేడియంలోని అభిమానులంతా అతడికి నీరాజనాలు పలుకుతున్నారు. అతడు భారతీయుడు కాదు. అయినా అతడికి బ్రహ్మరథం పడుతున్నారు. అతడు ఫోర్ బాదినా.. బ్యాటు పైకెత్తినా.. ఏబీడీ ఏబీడీ.. అనే నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. ఇప్పటికే అర్థమై ఉంటుంది అతడు ఎవరో కాదు ఏబీ డివిలియర్స్ అని. సొంత జట్టుని కాదని భారత అభిమానులంతా అతడిని ఆదరించిన తీరుని చూస్తే.. అది కేప్టౌనా? లేక బెంగళూరా? అనే సందేహాలు ఎవరికైనా కలుగుతాయంటే అతియోశక్తి కాదు! అంతలా భారతీయుల అభిమానాన్ని సంపాదించుకున్న మిస్టర్ 360 నేటితో 36 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాడు.
నేడు ఏబీడీ పుట్టినరోజు సందర్భంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల సహా పలువురు ఆటగాళ్లు డివిలియర్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ అయితే "హ్యాపీ బర్త్‌డే బ్రదర్" అంటూ ట్వీట్ చేశాడు. సామాజిక మాధ్యమాల వేదికగానూ ఇతడికి అభిమానుల నుంచి ట్వీట్లు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కొన్ని విశేషాలివే...
-
Happy bday brother. Wish you all the happiness and good health and lots of love to the family. See you soon 💪😃@ABdeVilliers17
— Virat Kohli (@imVkohli) February 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy bday brother. Wish you all the happiness and good health and lots of love to the family. See you soon 💪😃@ABdeVilliers17
— Virat Kohli (@imVkohli) February 17, 2020Happy bday brother. Wish you all the happiness and good health and lots of love to the family. See you soon 💪😃@ABdeVilliers17
— Virat Kohli (@imVkohli) February 17, 2020
భారత్ రెండో ఇళ్లు..
2004లో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలుపెట్టాడు ఏబీ. దక్షిణాఫ్రికా తరఫున అతడు 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 8,765, వన్డేల్లో 9,577, టీ20ల్లో 1,672 పరుగులు బాదాడు.
-
Happy birthday mr. 360#ABDevilliers pic.twitter.com/LIYcR39O7X
— Tarun (@Being__Tarun) February 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy birthday mr. 360#ABDevilliers pic.twitter.com/LIYcR39O7X
— Tarun (@Being__Tarun) February 17, 2020Happy birthday mr. 360#ABDevilliers pic.twitter.com/LIYcR39O7X
— Tarun (@Being__Tarun) February 17, 2020
దిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన డివిలియర్స్.. నాలుగో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వెళ్లాడు. నేటికీ అతడు ఆర్‌సీబీ జట్టులోనే ఉన్నాడు. అందుకే బెంగళూరు అతడికి రెండో ఇల్లు అయ్యింది. ప్రపంచక్రికెట్ చరిత్రలో సచిన్ తెందుల్కర్, డివిలియర్స్ లాంటి కొద్ది మంది మాత్రమే దేశ సరిహద్దులు చెరిపి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
-
#ABDevilliers
— MD Hussain ( حسین) (@mdhussain216) February 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The man who redefined cricket with his unmatchable skills, plus he is a great human being.
Happy birthday to the greatest legend of the game AB DE VILLIERS.#HappyBirthdayABD pic.twitter.com/D6n1yU5N0N
">#ABDevilliers
— MD Hussain ( حسین) (@mdhussain216) February 17, 2020
The man who redefined cricket with his unmatchable skills, plus he is a great human being.
Happy birthday to the greatest legend of the game AB DE VILLIERS.#HappyBirthdayABD pic.twitter.com/D6n1yU5N0N#ABDevilliers
— MD Hussain ( حسین) (@mdhussain216) February 17, 2020
The man who redefined cricket with his unmatchable skills, plus he is a great human being.
Happy birthday to the greatest legend of the game AB DE VILLIERS.#HappyBirthdayABD pic.twitter.com/D6n1yU5N0N
విరాట్‌కు మంచి జోడి..
బెంగళూరు సారథి విరాట్ కోహ్లితో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇద్దరూ కలిసి ఐదుసార్లు 100 పరుగులు.. రెండుసార్లు 200 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు. ప్రపంచంలో మరే జోడీ ఈ రికార్డును ఇప్పటివరకు చేరుకోలేదు.
డివిలియర్స్ తన ఐపీఎల్ కెరీర్‌లో 141 మ్యాచ్‌లాడి 39.33 సగటుతో 3,953 పరుగులు నమోదు చేశాడు. అందులో 3 శతకాలు, 28 అర్ధశతకాలు ఉండగా 151 స్ట్రైక్‌రేట్‌తో 326 ఫోర్లు, 186 సిక్సర్లు బాదాడు. వ్యక్తిగతంగా అత్యధికంగా 133 పరుగులతో అజేయంగా నిలిచాడు.
రీఎంట్రీపై ఎదురుచూపులు!
మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అనూహ్యంగా 2018, మే 23న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జట్టులో ఇతడికి చోటు దక్కే అవకాశాలున్నాయి. దక్షిణాఫ్రికా జట్టు తరఫున మొత్తం 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు డివిలియర్స్.
-
*Happy Birthday Super man Mr 360 ABD*❤❤❤❤❤#HappyBirthdayABD#ABDevilliers pic.twitter.com/CTzn5ZUVZG
— Jitendra vk (@VkJitendra) February 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">*Happy Birthday Super man Mr 360 ABD*❤❤❤❤❤#HappyBirthdayABD#ABDevilliers pic.twitter.com/CTzn5ZUVZG
— Jitendra vk (@VkJitendra) February 16, 2020*Happy Birthday Super man Mr 360 ABD*❤❤❤❤❤#HappyBirthdayABD#ABDevilliers pic.twitter.com/CTzn5ZUVZG
— Jitendra vk (@VkJitendra) February 16, 2020