ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​ గెలుపే కాదు.. అంతకుమించి! - భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్

ఇంగ్లాండ్​తో జరిగిన టీ20 సిరీస్​ను గెలిచి అభిమానుల్లో సంతోషాన్ని రెట్టింపు చేసింది టీమ్ఇండియా. ఈ సిరీస్​ ద్వారా టీ20 ప్రపంచకప్​నకు ముందు భారత జట్టులో కొన్ని సానుకూల అంశాలు కనిపించాయి. అవేంటో చూద్దాం.

IND vs ENG T20:
టీమ్ఇండియా
author img

By

Published : Mar 22, 2021, 7:32 AM IST

టెస్టు సిరీస్​లో ఇంగ్లాండ్​ను చిత్తుగా ఓడించినా అభిమానుల్లో అంతగా సంతృప్తి లేదు. కారణం.. తొలి టెస్టులో భారత్ ఓటమి తర్వాత పిచ్​లు పూర్తిగా స్పిన్​కు దాసోహం అనేలా తయారయ్యాయి. దీన్ని ఎంతగా సమర్థించుకున్నా.. టీమ్ఇండియా విజయంలో పిచ్​లు కీలకపాత్ర పోషించాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో భారత జట్టు సత్తాకు అసలైన పరీక్షగా నిలిచింది టీ20 సిరీస్. పిచ్​కు పెద్దగా ప్రాధాన్యం లేని పొట్టి క్రికెట్లో.. ప్రపంచ మేటి టీ20 జట్లలో ఒకటైన ఇంగ్లాండ్​ను ఓడించి సిరీస్ సాధించడం కోహ్లీసేన సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఈ విజయానికి మించి.. ఈ సిరీస్​లో భారత అభిమానులకు ఆనందాన్నిచ్చిన కొన్ని సానుకూలతలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్​ సన్నాహాల్లో ఉన్న భారత్​కు ఎంతో ఉత్సాహాన్నిచ్చిన ఆ సానుకూలతలేంటో చూద్దాం.

కోహ్లీ కొత్త పాత్ర

కొత్త ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ మెరిశారు. హార్దిక్‌ పాండ్య మళ్లీ బౌలింగ్‌ చేశాడు, రాణించాడు. భువనేశ్వర్‌ తిరిగి లయ అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఇలా ఎన్నో సానుకూలాంశాలు! అయితే వాటన్నింటినీ మించి ఈ సిరీస్‌లో అందరినీ ఆకట్టుకున్నది విరాట్‌ కోహ్లి ఆట. చివరి టీ20లో ఓపెనర్‌గా వచ్చి కొత్త చర్చకు తావిచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శిఖర్‌ ధావన్‌తో కలిసి చాలా ఏళ్లుగా ఓపెనింగ్‌ చేస్తూ వచ్చాడు రోహిత్‌ శర్మ. ఈ జోడీ వన్డేలు, టీ20ల్లో భారీగా పరుగులు సాధించింది. ఎన్నో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. కానీ రెండేళ్ల కిందటి నుంచి ధావన్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. నిలకడ తప్పడం వల్ల అతడికి జట్టులో చోటే ప్రశ్నార్థకమైంది. అదే సమయంలో కేఎల్‌ రాహుల్‌ చక్కటి ప్రదర్శనతో ఓపెనింగ్‌ స్థానంలో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తుండగా.. రోహిత్‌కు జోడీగా రాహుల్‌ ఖరారైనట్లే కనిపించాడు. పంత్‌ విఫలమవుతున్న సమయంలో కేఎల్‌ రాహుల్‌ను వికెట్‌ కీపర్‌గా కూడా ఉపయోగించుకున్న టీమ్‌ఇండియా.. ఒక దశలో ప్రపంచకప్‌లోనూ అతడికే గ్లోవ్స్‌ బాధ్యత అప్పగించాలన్న ఆలోచన కూడా చేసింది. కానీ ఉన్నట్లుండి అతను ఫామ్‌ కోల్పోవడం జట్టును ఆందోళనలోకి నెట్టింది. ఇంగ్లాండ్‌తో టీ20ల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ విఫలమై తుదిజట్టులో చోటు కోల్పోయాడు రాహుల్‌. దీంతో ఓపెనింగ్‌పై మళ్లీ సందిగ్ధత నెలకొంది.

Team India's positive things in this series
రోహిత్, కోహ్లీ

కొత్త కుర్రాడు ఇషాన్‌ కిషన్‌ ఓ మ్యాచ్‌లో ఓపెనింగ్‌ చేసి ఆశలు రేకెత్తించాడు కానీ.. ప్రపంచకప్‌ సమీపిస్తుండగా అతణ్నే ఓపెనర్‌గా ఆడించే సాహసం భారత్‌ చేస్తుందా అన్నది సందేహమే. అయితే ఇంగ్లాండ్‌తో చివరి టీ20లో ఓపెనర్‌గా వచ్చి అందరినీ ఆశ్చర్యానికి కొత్త చర్చకు తావిచ్చాడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. రోహిత్‌తో కలిసి చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేస్తూ జట్టుకు భారీ ఆరంభాన్నిచ్చాడు. ఈ జోడీ విజయవంతం కావడం వల్ల కోహ్లీ ఓపెనర్‌గానే వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అభిమానుల్లో కలిగింది. పైగా టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌తో కలిసి తాను ఓపెనింగ్‌ చేయాలనుకుంటున్నట్లు కోహ్లి కూడా సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

రాహుల్‌కు ఇంతటితో దారులు మూసుకుపోయినట్లు భావించలేం కానీ.. అతను మున్ముందు కూడా ఫామ్‌ అందుకోకుంటే కోహ్లీనే ఓపెనింగ్‌ బాధ్యత తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అయితే కోహ్లీ వ్యాఖ్యల గురించి రోహిత్‌ శర్మ దగ్గర ప్రస్తావిస్తే.. ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది కదా చూద్దాం అన్నాడు. అతడి ఆలోచన ఏమిటో కానీ.. ప్రపంచకప్‌ ముంగిట భారత్‌ మరీ ఎక్కువ మ్యాచ్‌లేమీ ఆడే అవకాశం లేని నేపథ్యంలో కోహ్లీ ఓపెనర్‌ పాత్రలోనే ప్రపంచకప్‌లో అడుగు పెడతాడేమో చూడాలి. దిగువన ఆడేందుకు చాలామంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని కొట్టిపారేయలేం.

బౌలర్ హార్దిక్

హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ పాత్ర పోషించి చాలాకాలం అయిపోయింది. వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని వచ్చాక అతను ఐపీఎల్లోనే కాక అంతర్జాతీయ మ్యాచ్​ల్లోనూ బౌలింగ్​కు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాలో ఒక మ్యాచ్ లో నాలుగు ఓవర్లు మాత్రమే వేశాడు. పాండ్యా బౌలింగ్ చేయకపోవడం వల్ల అదనపు బౌలర్‌ను తీసుకోవాల్సి వస్తోంది. టీ20 ప్రపంచకప్​లో ఆల్​రౌండర్​గా కీలకపాత్ర పోషించాల్సిన పాండ్యా.. ఇంకెప్పుడు బంతి అందుకుని రెగ్యులర్​గా బౌలింగ్ చేస్తాడా అని చూశారు అభిమానులు. ఎట్టకేలకు ఇంగ్లాండ్ సిరీస్​లో పాండ్యా జట్టు, అభిమానుల కోరిక తీర్చాడు. ఈ సిరీస్​లో అతను ప్రతి మ్యాచ్​లోనూ బౌలింగ్ చేశాడు. నాలుగో టీ20లో రెండు కీలక వికెట్లతో జట్టును గెలిపించాడు. చివరి టీ20లోనూ బంతితో సత్తాచాటాడు. ఇకపై ప్రతి మ్యాచ్లోనూ పాండ్యాను ఆల్​రౌండర్​గా చూడబోతున్నట్లే. ప్రపంచకప్ ముంగిట భారత్​కు ఇది ఎంతగానో కలిసొచ్చేదే!

హార్దిక్, కోహ్లీ

అతడి ముద్ర

ఒకప్పుడు వివిధ ఫార్మాట్లలో భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఉండేవాడు భువనేశ్వర్ కుమార్. కానీ తర్వాత నిలకడ లేమి, గాయాలు అతడి కెరీర్​ను దెబ్బతీశాయి. జట్టులో ప్రాధాన్యాన్ని తగ్గించాయి. అయితే గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్​నెస్ సాధించిన ఈ పేసర్ బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల ఇంగ్లాండ్ సిరీస్​లో బౌలింగ్ దళాన్ని నడిపించే బాధ్యత తీసుకున్నాడు. ఈ సిరీస్​లో నిలకడగా రాణించి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొన్నాడు. బౌలర్ల గణాంకాలు దారుణంగా దెబ్బతిన్న ఈ సిరీస్​లో భువీ ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ముఖ్యంగా చివరి టీ20లో అతడి బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరంభంలోనే రాయ్​ను ఔట్ చేసి, ఆపై కీలక సమయంలో బట్లర్​ను పెవిలియన్ చేర్చి మ్యాచ్​ను మలుపు తిప్పాడు. టీ20ల్లో బౌలింగ్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతకు భువీ ప్రదర్శన ఉపశమనాన్ని ఇచ్చేదే. బుమ్రాకు అతను తోడైతే భారత పేస్ విభాగం పదునెక్కుతుందనడంలో సందేహం లేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.