ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. భారత్‌తో వన్డే సిరీస్, త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్లో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. అతడు ప్రస్తుతం మోచేయి గాయంతో బాధపడుతున్నాడని, వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనని స్పష్టం చేశాడు. ఐదో టీ20 పూర్తయిన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆదివారంలో(మార్చి 21) స్పష్టత వచ్చే అవకాశముందని మెర్గాన్ చెప్పాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య పుణె వేదికగా మంగళవారం(మార్చి 23) తొలి వన్డే జరగనుంది.
ఐపీఎల్ ఈ సీజన్లో ఆర్చర్ ఆడకపోవడమనేది రాజస్థాన్ రాయల్స్‌కు కలవరపరిచే అంశం. గత సీజన్లో తన ప్రదర్శనతో మెప్పించిన జోఫ్రా.. ఈ సీజన్లోనూ అదరగొడతాడని ఫ్రాంచైజీ భావించింది. కానీ ఇప్పుడు అతడికి గాయమవడంతో నిరాశ చెందింది.
ఇవీ చదవండి: