ETV Bharat / sports

'భారత డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత విధించాలి!'

మొతేరా వికెట్​పై స్పందించాడు ఇంగ్లాండ్​ మాజీ బౌలర్​ మాంటీ పనేసర్​. తర్వాతి మ్యాచ్​కు ఈ తరహా పిచ్​ ఉంటే.. ఇండియా డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత విధించాలని ఐసీసీని కోరాడు. కనీసం మూడు రోజులైనా మ్యాచ్​ జరిగేలా పిచ్​ తయారు చేయాలన్నాడు.

IND vs ENG: 'If fourth Test's wicket is same, ICC should dock points'
'..భారత డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత విధించాలి'
author img

By

Published : Mar 1, 2021, 6:06 AM IST

అహ్మదాబాద్​ వేదికగా జరిగిన పింక్​ బాల్​ టెస్టు అనంతరం పిచ్​పై విమర్శలు ప్రతివిమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్ మాజీ బౌలర్​ మాంటీ పనేసర్​ మొతేరా వికెట్​పై స్పందించాడు. నాలుగో టెస్టుకు కూడా ఇదే తరహా పిచ్ ఉంటే.. టీమ్​ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్లలో ఐసీసీ కోత విధించాలని కోరాడు.

"మేం గతంలో క్లబ్​ క్రికెట్ ఆడిన వికెట్​ను తలపిస్తుంది మొతేరా పిచ్​. 100 పరుగులకు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసేవాళ్లం. ఆ చిన్న మొత్తాన్ని కూడా ఛేదించలేకపోయేవాళ్లం. ఎందుకంటే అది టర్నింగ్​ పిచ్​. ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేరొందిన నరేంద్ర మోదీ స్టేడియంలో​ ఈ తరహా వికెట్​ను ​తయారు చేశారు. కేవలం రెండ్రోజుల్లోనే ఆట ముగిసింది." అని పనేసర్​ పేర్కొన్నాడు.

పింక్​ టెస్ట్​ కాబట్టే..

పింక్​ టెస్టు వికెట్​ గురించి ఐసీసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు మాంటీ. "నాకు తెలిసి తర్వాత టెస్టుకు కూడా ఇదే వికెట్​ ఉంటుంది. అదే కనుక నిజమైతే.. టీమ్​ఇండియా డబ్ల్యూటీసీ పాయింట్లలో ఐసీసీ కోత విధించాలి. ఈ టెస్టుకు ముందు వరకు చెన్నై పిచ్​ గురించి మాట్లాడారు. ఇప్పుడు మొతేరా వికెట్​పై చర్చ నడుస్తోంది. ఇది చెపాక్​ పిచ్​ కంటే ఘోరంగా ఉంది." అని పనేసర్ అభిప్రాయపడ్డాడు.

ఇది పింక్ బాల్​ టెస్టు కాబట్టి ఐసీసీ.. దీనిని పరిగణనలోకి తీసుకోకపోవచ్చని మాంటీ అన్నాడు. గులాబీ బంతిని నెమ్మదిగా బౌలింగ్ చేస్తే అది ఉపరితలంపై వేగంగా వెళ్తుందనేది ప్రస్తుత వాదన.. అయితే తర్వాతి మ్యాచ్​ ఎరుపు బంతితో జరుగుతుందని పనేసర్ తెలిపాడు. అప్పుడు కూడా వికెట్ ఇలాగే ఉంటే పాయింట్లలో కోత విధించాలని అతడు కోరాడు. కనీసం మూడు నుంచి మూడున్నర రోజులు అయినా టెస్టు మ్యాచ్​ జరిగేలా పిచ్​ను తయారు చేయాలన్నాడు.

ఇదీ చదవండి: శ్రీలంక క్రికెట్ బోర్డు డైరెక్టర్​గా టామ్​ మూడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.