ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ప్రస్తుతం టీ విరామానికి టీమ్ఇండియా వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహిత్ (11), గిల్ (14) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌స్మిత్ (131) టెస్టుల్లో 27వ శతకం సాధించాడు. శుక్రవారం 166/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 172 పరుగులు చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. స్మిత్, లబుషేన్(91) బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఆపై మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడం వల్ల ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది.