ETV Bharat / sports

2011 వరల్డ్​కప్​ జ్ఞాపకాలతో ఫ్యాన్స్​కు ఐసీసీ గిఫ్ట్​ - 2011 ప్రపంచకప్​పై ఐసీసీ సిరీస్​

ధోనీ సారథ్యంలో టీమ్ఇండియా ప్రపంచకప్​-2011 గెలుపొంది పదేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ఆనాటి మ్యాచ్​ల తాలూకూ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకునేందుకు ఐసీసీ సన్నాహాలు చేస్తోంది. ప్రతి మ్యాచ్​కు సంబంధించి హైలైట్స్​ను సోషల్​మీడియాలో షేర్​ చేయడం సహా భారత మ్యాచ్​ల హైలైట్స్​ను హిందీ, ఇంగ్లీష్​ భాషల్లో అందుబాటులో తీసుకురానుంది ఐసీసీ.

ICC to launch series to celebrate India's 2011 World Cup win
2011 ప్రపంచకప్ జ్ఞాపకాలతో ఐసీసీ సిరీస్​
author img

By

Published : Feb 18, 2021, 1:28 PM IST

2011లో వన్డే ప్రపంచకప్​ను టీమ్​ఇండియా గెలుపొంది పదేళ్లు కావోస్తోంది. ఈ సందర్భంగా టోర్నీకి సంబంధించిన మ్యాచ్​ల సిరీస్​ను క్రికెట్​ ప్రేమికుల కోసం #CWC11Rewind పేరిట అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ (ఐసీసీ) అందుబాటులోకి తీసుకురానుంది. సోషల్​మీడియాలో వంద పోస్టుల ద్వారా ఆనాటి ఐకానిక్​ మూమెంట్స్​ను పంచుకోనుంది.

టోర్నీలో జరిగిన మ్యాచ్​ల తేదీల్లోనే వాటికి సంబంధించిన హైలైట్స్​ను 5 నిమిషాల నిడివితో ఐసీసీ వెబ్​సైట్లో ఉంచనుంది. టీమ్​ఇండియా ఆడిన మ్యాచ్​ల హైలైట్స్​ అన్నీ హిందీ, ఇంగ్లీష్​ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. మహేంద్ర సింగ్​ ధోనీ సారథ్యంలో టీమ్​ఇండియా ఫైనల్​కు చేరింది. ముంబయి వేదికగా శ్రీలంకతో జరిగిన తుదిపోరులో భారత జట్టు జయకేతనం ఎగురవేసి.. రెండోసారి ప్రపంచకప్​ను సాధించింది.

ఇదీ చూడండి: ఐపీఎల్​ వేలం నుంచి ఇంగ్లాండ్​ క్రికెటర్​ ఔట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.