541 అంతర్జాతీయ మ్యాచ్లు ప్రసారం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), ఐఎంజీ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 2022 టీ20 ప్రపంచకప్, 2023 పురుషుల ప్రపంచకప్, 2023 మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్లను ఐఎంజీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ఒప్పందం 2023 ఏప్రిల్ వరకు అమల్లో ఉంటుంది.
ఎక్కువ మంది అభిమానులకు మరింత క్రికెట్ ఆనందాన్ని పంచేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఐసీసీ పేర్కొంది.
541 మ్యాచ్లలో 145 మహిళలకు చెందినవి. 80 అసోషియేట్ సభ్యులకు చెందిన 41 క్వాలిఫైయర్ మ్యాచ్లను ప్రసారం చేయనున్నారు. అందులో 50కన్నా ఎక్కువ సభ్యులకు తొలిసారి అంతర్జాతీయ ప్రసారం లభించనుంది.
ఇదీ చూడండి: ఐఎంజీ-ఆర్‌లో 50% వాటా కొనుగోలు: ఆర్‌ఐఎల్