జనవరి నెలకుగానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు నామినేట్ అయిన క్రికెటర్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించింది. ఇందులో టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, ఇంగ్లాండ్ సారథి జో రూట్, ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ ఉన్నారు.
ఇటీవల ఆసీస్‌పై జరిగిన సిరీస్‌లో రెండు టెస్టులు ఆడిన పంత్.. సిడ్నీ టెస్టులో 97, గబ్బాలో 89 పరుగులు చేసి విజయంలో కీలకంగా వ్యవహరించాడు. శ్రీలంకపై టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకోవడంలో ఇంగ్లాండ్ సారథి జో రూట్(228,186) కీలక పాత్ర పోషించాడు. యూఏఈ, అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు సెంచరీలు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు ఐర్లాండ్ ఆటగాడు స్టిర్లింగ్. ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే వీరిని ఎంపిక చేసినట్లు తెలిపింది ఐసీసీ.
-
Who’s your ICC Men’s Player of the Month for January?
— ICC (@ICC) February 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Joe Root 🏴 426 Test runs at 106.50.
Rishabh Pant 🇮🇳 245 Test runs at 81.66.
Paul Stirling ☘️ 420 ODI runs at 105.00.
Vote here 👉 https://t.co/FBb5PMqMm8 pic.twitter.com/sQKO9HwqPS
">Who’s your ICC Men’s Player of the Month for January?
— ICC (@ICC) February 2, 2021
Joe Root 🏴 426 Test runs at 106.50.
Rishabh Pant 🇮🇳 245 Test runs at 81.66.
Paul Stirling ☘️ 420 ODI runs at 105.00.
Vote here 👉 https://t.co/FBb5PMqMm8 pic.twitter.com/sQKO9HwqPSWho’s your ICC Men’s Player of the Month for January?
— ICC (@ICC) February 2, 2021
Joe Root 🏴 426 Test runs at 106.50.
Rishabh Pant 🇮🇳 245 Test runs at 81.66.
Paul Stirling ☘️ 420 ODI runs at 105.00.
Vote here 👉 https://t.co/FBb5PMqMm8 pic.twitter.com/sQKO9HwqPS
మహిళా క్రికెటర్స్‌లో దియానా బైగ్(పాకిస్థాన్), శభ్నిమ్ ఇస్మయిల్, మరిజన్నె కప్(ఇద్దరు దక్షిణాఫ్రికా) ఈ రేసులో ఉన్నారు. వీరిలో బైగ్ వన్డేల్లో 13.22 ఎకానమీతో 9 వికెట్లు తీయగా.. ఇస్మాయిల్ 4.57 ఎకానమీతో టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టింది. మరిజన్నె వన్డేల్లో 115 బంతుల్లో 115 పరుగులు చేసింది. వీరిలో విజేతను ఓటింగ్ ద్వారా ప్రకటిస్తారు.
-
Who’s your ICC Women’s Player of the Month for January?
— ICC (@ICC) February 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Diana Baig 🇵🇰 Nine wickets at 13.22 in ODIs.
Shabnim Ismail 🇿🇦 Seven wickets at 4.57 in T20Is.
Marizanne Kapp 🇿🇦 115 runs at 115 in ODIs.
Vote here 👉 https://t.co/lZfMwphyiK pic.twitter.com/1S3lTRKSwy
">Who’s your ICC Women’s Player of the Month for January?
— ICC (@ICC) February 2, 2021
Diana Baig 🇵🇰 Nine wickets at 13.22 in ODIs.
Shabnim Ismail 🇿🇦 Seven wickets at 4.57 in T20Is.
Marizanne Kapp 🇿🇦 115 runs at 115 in ODIs.
Vote here 👉 https://t.co/lZfMwphyiK pic.twitter.com/1S3lTRKSwyWho’s your ICC Women’s Player of the Month for January?
— ICC (@ICC) February 2, 2021
Diana Baig 🇵🇰 Nine wickets at 13.22 in ODIs.
Shabnim Ismail 🇿🇦 Seven wickets at 4.57 in T20Is.
Marizanne Kapp 🇿🇦 115 runs at 115 in ODIs.
Vote here 👉 https://t.co/lZfMwphyiK pic.twitter.com/1S3lTRKSwy
అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇటీవల నిర్ణయించింది. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో పురుషులు, మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించేందుకు ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు తెలపింది. దీనిలో భాగంగానే జనవరి నెలకుగానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుల నామినీలను ప్రకటించింది.
ఇదీ చూడండి: ఉత్తమ క్రికెటర్లకు ఇక ప్రతి నెలా ఐసీసీ అవార్డులు