ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ దాటలేకపోయింది. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్న భారత స్పిన్నర్ చాహల్.. తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. మహీ భాయ్ ఔటైన సందర్భంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నాడు.
"ఇది నా తొలి ప్రపంచకప్. కివీస్‌తో మ్యాచ్‌లో ధోనీ ఔటైన తర్వాత నేను బ్యాటింగ్‌కు వెళ్లా. ఆ సమయంలో కన్నీరు ఆపుకోలేకపోయాను. ఆ సందర్భం నాకు చాలా బాధ కలిగించింది. టోర్నీ ఆసాంతం బాగా ఆడి.... సెమీస్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించాం" -యుజువేంద్ర చాహల్,భారత బౌలర్
ఆ మ్యాచ్‌లో 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది టీమిండియా. జడేజాతో కలిసి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ధోని.. 49 ఓవరలో రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటి వరకు విజయానికి చేరువలో ఉన్న కోహ్లీసేన.. మ్యాచ్‌పై పట్టు కోల్పోయి ఓటమిపాలైంది.
ఆ టోర్నీ అనంతరం టీమిండియా తరఫున కేవలం ఒకే ఒక్క వన్డే ఆడాడు చాహల్. టీ20లకు అతడిని ఎంపిక చేయట్లేదు.
ఇది చదవండి: జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్ వృథా... ప్రపంచకప్ ఫైనల్లో కివీస్