ETV Bharat / sports

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భారత క్రికెటర్! - ఆత్మహత్య చేసుకోవాలన్న రాబిన్​

ఒకప్పుడు తీవ్ర మనోవేదనకు గురై, ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యానని చెప్పాడు సీనియర్ క్రికెటర్ ఊతప్ప. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ఓ లైవ్​చాట్​లో మాట్లాడుతూ దీనితో పాటే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

utappa
ఉతప్పా
author img

By

Published : Jun 4, 2020, 3:08 PM IST

ఒకానొక సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవించినట్లు, ఆత్మహత్య చేసుకోవాలని, చాలాసార్లు ప్రయత్నించినట్లు చెప్పాడు టీమిండియా సీనియర్ క్రికెటర్​ రాబిన్​ ఉతప్ప. 2006లో టీమిండియా జట్టులోకి అరంగేట్రం చేసిన ఇతడు... జట్టులో బాగా రాణించాడు. భారత్​ తరఫున 46 వన్డేలు, 13 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే రాజస్థాన్​ రాయల్స్​ నిర్వహించిన లైవ్​ చాట్​లో 'మెదడు, శరీరము, ఆత్మ.. పాజిటివ్​గా ఉండటం వల్ల కలిగే లాభాలు ఏంటి?' అనే అంశంపై ఉతప్ప మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.

"2006లో క్రికెట్​లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వృద్ధి చెందుతూ వచ్చాను. నాలో ఉత్పన్నమయ్యే ప్రతికూల ఆలోచనలను నియంత్రించుకోగలిగే దశకు చేరుకున్నాను. 2009-2011 మధ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు విపరీతంగా నాకు వచ్చేవి. కొన్ని సందర్భాల్లో బాల్కానీపై నుంచి దూకి చనిపోయేందుకు ప్రయత్నించాను. అయితే ఏదో ఓ కారణంతో అగిపోయేవాడిని. అనంతరం ఈ ఆలోచనల నుంచి బయటపడేందుకు తీవ్ర కృషి చేశాను. ప్రతిరోజు నన్ను నేనుగా అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నా జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కొంతమంది సహాయం తీసుకున్నాను. ఏదేమైనప్పటికీ ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి చివరికి బయటపడ్డాను. ఓ మనిషిగా రూపుదిద్దుకున్నాను. ఈ పరిస్థితి నాకు కొన్ని అనుభవాలను నేర్పించింది. క్రమంగా సానుకూలంగా అలోచించటం మొదలుపెట్టాను. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల, అనుకూల పరిస్థితులను సమతుల్యం చేసుకుంటా జీవించాలి. అప్పుడే జీవితం సరైన రీతిలో ముందుకు సాగుతుంది"

-రాబిన్​ ఉతప్ప, టీమిండియా సీనియర్ క్రికెటర్​

ప్రస్తుతం ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​ తరఫున ఆడుతున్నాడు ఉతప్ప. కరోనా నేపథ్యంలో ఐపీఎల్​ 13వ సీజన్​ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ. సెప్టెంబరు-నవంబరు మధ్యలో ఈ టోర్నీని నిర్వహించాలని భావిస్తున్నారు.

ఇదీ చూడండి : ఐసీసీ విచారణలో ముగ్గురు 'ఫిక్సింగ్​' క్రికెటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.