ETV Bharat / sports

'టెస్టుల్లో మళ్లీ ఆడతానని అనుకోవడం లేదు' - ఆరోన్​ ఫించ్​ న్యూస్​

టెస్టు ఫార్మాట్​లో తన కెరీర్​ ముగిసిపోయిందని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్​ ఆరోన్​ ఫించ్​. మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్​లో ఆడటం అసాధ్యమనిపించినా.. చివరిగా ఓ టెస్టు సిరీస్​లో ఆడాలని ఉన్నట్లు తాజాగా వెల్లడించాడు.

I don't think it's realistic for me to play Test cricket again: Finch
'టెస్టుల్లో నేను మళ్లీ ఆడతానని అనుకోవడం లేదు'
author img

By

Published : Aug 27, 2020, 1:14 PM IST

తన టెస్టు కెరీర్​ ముగిసిందని అన్నాడు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్​ ఆరోన్​ ఫించ్​. సు​దీర్ఘ ఫార్మాట్​లో మళ్లీ ఆడటం అసాధ్యంగా కనిపిస్తుందని తాజాగా వెల్లడించాడు. తన రిటైర్మెంట్​ కంటే ముందు చివరిసారి టెస్టు సిరీస్​ ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2023లో భారత్​ వేదికగా జరగనున్న ప్రపంచకప్​ తన క్రికెట్​ కెరీర్​లో చివరిదని స్పష్టం చేశాడు.

"టెస్టు క్రికెట్​ మళ్లీ ఆడతానని నేను అనుకోను. ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో యువ ఆటగాళ్లు చాలా మంది రాణిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జాతీయ జట్టులోనూ అద్భుతమైన ప్రతిభ కలిగిన వారు ఉండటం సహా టాప్​-ఆర్డర్​ బ్యాటింగ్​ చాలా బలంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలోనూ జట్టులో కొనసాగడం అవసరమని నేను అనుకోను".

-ఆరోన్​ ఫించ్​, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్​

ఫించ్​ తన కెరీర్​లో ఐదు టెస్టులు, 126 వన్డేలు, 61 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో ఇంగ్లాండ్​ జట్టుపై 1000 పరుగుల మైలురాయి చేరుకోవడానికి ఫించ్​ ఇంకా 28 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లాండ్​ జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఫించ్​ కంటే ముందు రికీ పాంటింగ్​, ఆడమ్​ గిల్​క్రిస్ట్​, మైఖేల్​ క్లార్క్​ ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.