ETV Bharat / sports

నాకు ఇప్పుడు బాగానే ఉంది: దీపక్​ - దీపక్​ చాహర్​

చెన్నై సూపర్​ కింగ్స్ ఆటగాడు దీపక్​ చాహర్​ ఇటీవలే కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు ఇన్​స్టాగ్రామ్​ వేదికగా తెలిపాడు.

Deepak Chahar
దీపక్​ చాహర్​
author img

By

Published : Sep 2, 2020, 5:25 AM IST

ఇటీవలే కరోనా బారిన పడ్డ చెన్నై సూపర్​కింగ్స్​ ఆటగాడు దీపక్​ చాహర్​.. ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్​లో తనను తాను ఫిట్​గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పంచుకున్నాడు. తనకు ప్రేమను పంచుతూ, మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

ఐపీఎల్​ నిమిత్తం సీఎస్కే జట్టుతో దుబాయ్​ చేరుకున్న తర్వాత చేసిన పరీక్షల్లో ఇద్దరు ఆటగాళ్లు, 13 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వారిలో దీపక్​ చాహర్​ ఒకరు. లక్షణాలు లేని కేసులైనప్పటికీ.. వారిని జట్టు నుంచి వేరు చేసి ఐసోలేషన్​లో ఉంచారు అధికారులు. ఈ క్రమంలోనే సీఎస్కే క్వారంటైన్​ సమయాన్ని పొడిగించారు.

కాగా తాజాగా చేసిన పరీక్షల్లో మిగిలిన జట్టు సభ్యులకు నెగిటివ్​ నిర్ధరణ అయ్యింది. సెప్టెంబరు 3న ఆఖరి పరీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఆటగాళ్లు ప్రాక్టీసు సెషన్​ ప్రారంభించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.