ETV Bharat / sports

'నాలుగున్నర నెలల్లో 22 సార్లు కొవిడ్​ టెస్ట్' - ఐపీఎల్​ 2020 వార్తలు

గడచిన నాలుగున్నర నెలల కాలంలో తాను 22 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ తెలిపాడు. ఐపీఎల్​ నిర్వహణ కోసం సెప్టెంబరులో యూఏఈ చేరుకున్న దాదా.. అక్కడ తనకు ఎదురైన కరోనా పరిస్థితుల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Have undergone 22 COVID tests in past four and half months: Sourav Ganguly
'ఇప్పటివరకు 22 సార్లు కొవిడ్​ టెస్టులు చేయించుకున్నా'
author img

By

Published : Nov 25, 2020, 9:40 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. యూఏఈ వేదికగా ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ నిర్వహించడం వల్ల సెప్టెంబర్ నుంచి నవంబర్‌ వరకు గంగూలీ లీగ్‌ పనులతో బిజీగా ఉన్నాడు. దాదా ప్రస్తుతం ఇండియా చేరుకున్నాడు. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న కరోనా పరిస్థితుల గురించి వెల్లడించాడు.

"గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. ఒక్కసారి కూడా పాజిటివ్‌ రాలేదు. నా పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు ఉండటం వల్ల పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. అయితే నేను.. మా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను. లీగ్ ఆరంభంలో దుబాయ్‌కు వెళ్లి వచ్చిన సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యా. నా వల్ల ఇతరులకు ఎక్కడ కరోనా వ్యాప్తి జరుగుతుందోనని భయపడ్డాను".

- సౌరవ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

బయోబబుల్‌లో దాదాపు 400 మంది ఆటగాళ్లు, సిబ్బందితో ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించామని గంగూలీ అన్నాడు. లీగ్‌ నిర్వహణ సమయంలో సుమారు 30-40 వేల పరీక్షలు చేయించామని తెలిపాడు. ఐపీఎల్ భారత్‌కు ఎంతో కీలకమని, ప్రజలు లీగ్ విజయం గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. కాగా, దేశవాళీ క్రికెట్‌ను అతి త్వరలో తిరిగి ఆరంభిస్తామని అన్నాడు.

అలాగే వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌కు ఆతిథ్యం ఇస్తామని గంగూలీ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనుందని తెలిపాడు. అయితే తొమ్మిది, పది జట్లతో మ్యాచ్‌లను నిర్వహించడం కంటే రెండు జట్ల ఆటగాళ్లకు ఏర్పాట్లు చేయడం సులువని అభిప్రాయపడ్డాడు. మహమ్మారి సెకండ్‌ వేవ్‌ గురించి వింటున్నామని, ముంబయి, దిల్లీలో కేసులు పెరుగుతున్నాయని అన్నాడు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేస్తామని దాదా అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.