ETV Bharat / sports

ఎప్పటికీ ఆయనే నా హీరో: సచిన్ - సునీల్​ను సత్కరించిన బీసీసీఐ

క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్​ను సత్కరించింది బీసీసీఐ. క్రికెట్ అరంగేట్రం చేసి 50 ఏళ్లయినా సందర్భంగా మొతేరా వేదికగా సన్నీని సన్మానించారు బీసీసీఐ సెక్రటరీ. ఈ నేపథ్యంలో సన్నీయే తన రియల్ హీరో అంటూ లిటిల్​ మాస్టర్ సచిన్​ ట్వీట్​ చేశారు.

Gavaskar celebrates 50th anniversary of Test debut, felicitated by BCCI
ఎప్పటికీ అతడే నా హీరో... సచిన్
author img

By

Published : Mar 6, 2021, 5:56 PM IST

Updated : Mar 6, 2021, 6:14 PM IST

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ క్రికెట్​ ప్రయాణం మొదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీసీసీఐ ఆయన్ని సత్కరించింది. భారత్​, ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు లంచ్​ బ్రేక్​ సమయంలో బీసీసీఐ సెక్రటరీ... గావస్కర్​ను సత్కరించారు. 1971 మార్చి 6న సన్నీ తన తొలి టెస్టు అరంగేట్రం చేశాడు.

ఈ సందర్భంగా సన్నీ తొలిసారిగా ఇన్​స్టా ఖాతాను తెరిచినట్లు పేర్కొన్నాడు.

'అతడే నా హీరో..'

క్రికెట్ దిగ్గజం సునీల్​ గావస్కర్​ను కొనియాడుతూ ట్వీట్​ చేశాడు సచిన్ తెందూల్కర్. గావస్కర్​ తన రోల్​ మోడల్​ అని అన్నాడు.

"50 ఏళ్ల క్రితం గావస్కర్​ తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. మొదటి సిరీస్​లోనే 774 పరుగులు చేశాడు. ఆయనే నాకు ఆదర్శం. యువ ఆటగాడిగా ఉన్నప్పుడు గావస్కర్​లా ఎదగాలని కలలు కన్నాను. ఎప్పటికీ తనే నా హీరో."

-సచిన్ తెందూల్కర్, భారత మాజీ క్రికెటర్.

ఇదీ చదవండి:ఇంగ్లాండ్​ను చుట్టేసిన అశ్విన్​, అక్షర్​- సిరీస్​ భారత్​ సొంతం

Last Updated : Mar 6, 2021, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.