బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యాధికారి ఒకరు తెలిపారు. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్టులు సాధారణంగా ఉంటే.. ఆయనను శనివారమే డిశ్చార్జి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
"గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. శుక్రవారం రాత్రి బాగా నిద్ర పోయారు. ఉదయం కొంచెం ఆహారం తీసుకున్నారు" అని ఓ వైద్యాధికారి వెల్లడించారు.
రెండోసారి యాంజియోప్లాస్టీ చేయించుకున్న ఈ మాజీ క్రికెటర్‌ను డిశ్చార్జి చేయడానికి ఫిట్‌గా ఉన్నాడా? లేడా? అని వైద్యులు పరీక్షించారు. ఆ రిపోర్టులు సాధారణమని వస్తే శనివారమే అతన్ని డిశ్చార్జి చేస్తామని తెలిపారు.
జనవరి ప్రారంభంలో స్వల్ప గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన గంగూలీకి.. మొదటి సారి ఒక స్టంట్ వేయగా.. తాజాగా మరో రెండు స్టంట్లు వేశారు.
ఇదీ చదవండి: 87 ఏళ్ల చరిత్రలో తొలిసారి 'రంజీ' టోర్నీ రద్దు