వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్, మాజీ సారథి క్లైవ్ లాయిడ్ బ్రిటిష్ అత్యున్నత పురస్కారం 'నైట్‌హుడ్'ను అందుకోనున్నాడు. ఇటీవల విడుదల చేసిన 'న్యూ ఇయర్ ఆనర్స్ లిస్ట్'లో బ్రిటన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాకుండా 'సర్' బిరుదును సొంతం చేసుకున్న విండీస్ క్రికెట్ ఆటగాళ్లు గారీ సోబర్స్, ఎవర్టన్ వీక్స్, వివియన్ రిచర్డ్స్ వంటి దిగ్గజాల సరసన లాయిడ్ నిలువబోతున్నాడు.
"క్రికెట్‌లో అత్యుత్తమ సేవలకుగాను నూతన సంవత్సరం సందర్భంగా 'నైట్‌హుడ్'ను స్వీకరించనున్న వెస్టిండీస్ గ్రేట్ క్లైవ్ లాయిడ్‌కు శుభాకాంక్షలు" అని విండీస్ క్రికెట్ బోర్డ్ ట్వీట్ చేసింది.
-
ARISE SIR CLIVE
— Windies Cricket (@windiescricket) December 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to West Indies Great Clive Lloyd who is set to receive a Knighthood in the New Year for his outstanding service to Cricket 👏👏 pic.twitter.com/bFRO9KVaOR
">ARISE SIR CLIVE
— Windies Cricket (@windiescricket) December 27, 2019
Congratulations to West Indies Great Clive Lloyd who is set to receive a Knighthood in the New Year for his outstanding service to Cricket 👏👏 pic.twitter.com/bFRO9KVaORARISE SIR CLIVE
— Windies Cricket (@windiescricket) December 27, 2019
Congratulations to West Indies Great Clive Lloyd who is set to receive a Knighthood in the New Year for his outstanding service to Cricket 👏👏 pic.twitter.com/bFRO9KVaOR
భారత్‌తో మ్యాచ్‌లో అరంగేట్రం...
క్లైవ్ హ్యుబర్ట్ లాయిడ్... 1944లో బ్రిటిష్ గయానాలో జన్మించాడు. 22 సంవత్సరాల వయసులో భారత్‌తో జరిగిన టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నుంచి దాదాపు 110 టెస్ట్ మ్యాచ్‌ల్లో 7515 పరుగులు చేశాడు. 46కు పైగా సగటుతో రాణించాడు. టెస్ట్ క్రికెట్‌లో వ్యక్తిగత అత్యధిక స్కోరు 242 నాటౌట్. సుదీర్ఘ ఫార్మాట్లో 19 సెంచరీలు, 39 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డే క్రికెట్‌లో లాయిడ్ 87 మ్యాచ్‌లు ఆడి.. 39.53 సగటుతో 1977 పరుగులు చేశాడు.
ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ 1975, 1979లలో ప్రపంచకప్‌ను గెలిచిన వెస్టిండీస్ జట్టుకు సారథ్యం వహించాడు. ఇతడి కెప్టెన్‌గా ఉన్నప్పుడే కరీబియన్ జట్టు వరుసగా 11 అంతర్జాతీయ మ్యాచుల్లో విజయాలు నమోదు చేసింది. మొత్తం 27 విజయాలను ఖాతాలో వేసుకుంది.