ETV Bharat / sports

'అభిమానుల కోసం ఈసారి ఆర్సీబీ కప్ గెలుస్తుంది'

తమ అభిమానుల కోసమైనా సరే ఈసారి కప్పు కొడతామని చెప్పాడు పేసర్ ఉమేశ్ యాదవ్. అందుకోసం బాగా కష్టపడుతున్నట్లు తెలిపాడు. సెప్టెంబరు 19 నుంచి టోర్నీ మొదలు కానుంది.

Umesh Yadav
ఉమేశ్​ యాదవ్
author img

By

Published : Sep 5, 2020, 10:36 AM IST

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరులో కోహ్లీ, ఏబీ డివీలియర్స్​ లాంటి స్టార్​ క్రికెటర్లు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కనీసం ఒక్కసారైనా ఐపీఎల్​ టైటిల్​ గెల్చుకోలేకపోయిందీ జట్టు. కానీ ఈసారి మాత్రం అభిమానుల కోసమైనా సరే విజేతగా ​నిలవాలనే కసితో బరిలో దిగుతున్నామని పేసర్​ ఉమేశ్​ యాదవ్ చెప్పాడు​. ఏది ఏమైనా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశాడు. నెట్స్​లో బాగా చెమటోడ్చుతున్నామని పేర్కొన్నాడు. జట్టులో స్పిన్​, పేస్​ దళం సమతుల్యంగా ఉన్నాయని వెల్లడించాడు.

"స్పిన్నర్లు చాహల్​, మొయిన్​ అలీ, సుందర్​.. క్రిస్​ మోరిస్​, డేల్​ స్టెయిన్ లాంటి గొప్ప ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. ​ టీమ్​లోని ప్రతి ఆటగాడు ఈ సారి అద్భుతంగా ఆడతారు. కాబట్టి మేం ఈసారి కప్పు గెలుస్తాం"

-ఉమేశ్​ యాదవ్​, ఆర్సీబీ పేసర్​

సెప్టెంబరు 19 నుంచి బయో సెక్యూర్​ వాతావరణంలో టోర్నీ జరగనుంది. ఇప్పటికే దుబాయ్​ చేరుకున్న ఆర్సీబీ.. క్వారంటైన్​ పూర్తి చేసుకుని ప్రాక్టీసు​ కూడా మొదలుపెట్టేసింది.

ఇది చూడండి ఎప్పటికైనా ఆర్సీబీతోనే ఉంటాను: కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.