నగ్నంగా కీపింగ్ చేస్తూ.. కొన్ని రోజుల క్రితం అందరినీ ఆశ్చర్యపరిచిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్ మరోసారి సంచలనం రేపింది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ షాక్కు గురిచేసింది. మానసిక ఆందోళనతో బాధపడుతున్న ఆమె ఇకపై క్రికెట్ ఆడలేనని తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
"2006లో నా కల నెరవేరింది. ఇన్నేళ్లలో నేను సాధించనదానిపట్ల గర్వపడుతున్నా. ఉత్తమ క్రీడాకారులతో కలిసి ఆడా. నా ఆరోగ్యం దృష్ట్యా వీడ్కోలు పలికేందుకు ఇదే మంచి సమయం అనుకుంటున్నా. ఇంగ్లాండ్ జెర్సీ ధరించి ఆడిన ప్రతీ నిమిషాన్ని ఆస్వాదించా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" -సారా టేలర్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్
-
In 2006 my dream came true and I beam with pride at what I've achieved over the years, alongside the best players and people. It is the right time for me and my health to retire, but I have loved every minute in an England shirt. Thank you to everyone for supporting me ❤️ pic.twitter.com/8MdTqpgmWe
— Sarah Taylor (@Sarah_Taylor30) September 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">In 2006 my dream came true and I beam with pride at what I've achieved over the years, alongside the best players and people. It is the right time for me and my health to retire, but I have loved every minute in an England shirt. Thank you to everyone for supporting me ❤️ pic.twitter.com/8MdTqpgmWe
— Sarah Taylor (@Sarah_Taylor30) September 27, 2019In 2006 my dream came true and I beam with pride at what I've achieved over the years, alongside the best players and people. It is the right time for me and my health to retire, but I have loved every minute in an England shirt. Thank you to everyone for supporting me ❤️ pic.twitter.com/8MdTqpgmWe
— Sarah Taylor (@Sarah_Taylor30) September 27, 2019
ఇంగ్లాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్గా ఘనత సాధించింది టేలర్. 2006లో అరంగేట్రం చేసిన ఈమె మూడు ఫార్మాట్లలో కలిపి 226 మ్యాచ్ల్లో 6వేల 533 పరుగులు చేసింది. ఇటీవలే మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమంలో నగ్నచిత్రం పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది.
ఇదీ చదవండి: నగ్నంగా కీపింగ్ చేసిన ఇంగ్లీష్ క్రికెటర్!