ETV Bharat / sports

'ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ మాకు 'యాషెస్'' - విజ్డెన్ ట్రోఫీ ఇంగ్లాండ్ వెస్టిండీస్ సిరీస్

త్వరలో ఇంగ్లీష్ జట్టుతో జరగబోయే సిరీస్​ తమకు 'యాషెస్'లాంటిదని చెప్పాడు విండీస్ బౌలర్ రోచ్. ట్రోఫీ పట్టుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.

'ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ మాకు 'యాషెస్''
విండీస్ బౌలర్ కీమర్ రోచ్
author img

By

Published : Jul 5, 2020, 7:00 PM IST

జులై 8 నుంచి ఇంగ్లాండ్​-వెస్టిండీస్​ టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాట్లాడిన విండీస్ బౌలర్ కీమర్ రోచ్.. తమకు ఇది ప్రఖ్యాత 'యాషెస్' లాంటిదని అన్నాడు. స్వదేశానికి ట్రోఫీ తీసుకెళ్లడమే తమ జట్టు అంతిమ లక్ష్యమని స్పష్టం చేశాడు.

"ఈ సిరీస్​లో విజేతగా నిలిచి ట్రోఫీ తీసుకెళ్లడమే మా తొలి ప్రాధాన్యం. ఇంగ్లాండ్​పై​ గెలవడం ముఖ్యమే అయితే దానికి ట్రోఫీ తోడైతే ఆ మజానే వేరు. అలానే ఇది మాకు 'యాషెస్'లాంటిది" -కీమర్ రోచ్, విండీస్ బౌలర్

kemer roach
విండీస్ బౌలర్ కీమర్ రోచ్

అయితే కరోనా లాక్​డౌన్ తర్వాత నిర్వహిస్తున్న తొలి సిరీస్​ కావడం వల్ల అందరి కళ్లు దీనిపైనే ఉన్నాయి. ఐసీసీ కొత్త నిబంధనలు(బంతికి ఉమ్మి రాయకూడదు వంటివి) దీనితోనే అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్లు ఎలాంటి ప్రదర్శన చేస్తాయోనని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

కరీబియన్ దేశంలో ఈ రెండుజట్ల మధ్య జరిగిన గత టెస్టు సిరీస్​లో వెస్టిండీస్​ విజేతగా నిలిచింది. ప్రస్తుతం జరిగే 'విజ్డెన్ ట్రోఫీ' సిరీస్​ను డ్రా చేసుకున్నా సరే విండీస్​కు లాభమే. ఇందులో భాగంగా మూడు మ్యాచ్​లు జరగనున్నాయి. వీటిని జులై 8 నుంచి 28 మధ్య జరపనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.