బంగ్లాదేశ్ ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో ప్రపంచకప్ గెలిచినా.. వారి ప్రవర్తన మాత్రం తీవ్ర విమర్శల పాలైంది. ఫైనల్‌లో బంగ్లా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆ జట్టు ఆటగాళ్లు నోటికి పని చెప్పారు. బ్యాట్స్‌మెన్‌ను అదే పనిగా కవ్వించారు. పేసర్ షొరిఫుల్ ఇస్లామ్ అయితే.. ప్రతి బంతికీ బ్యాట్స్‌మెన్‌ను తిడుతూ కనిపించాడు. దీనిపై వ్యాఖ్యాతల్లోనూ చర్చ జరిగింది. బదులుగా తర్వాత భారత బౌలర్లు కూడా కొన్నిసార్లు స్లెడ్జింగ్ చేసినా.. బంగ్లా ఆటగాళ్లు చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు.
అవును.. వారు చేసింది తప్పే..
మ్యాచ్‌లో చేసింది సరిపోదని.. విజయానంతరం బంగ్లా ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. మైదానంలోకి పరుగెత్తుకొచ్చి భారత కుర్రాళ్లను చూసి వెకిలి సంజ్ఞలు చేశారు. షొరిఫుల్ శ్రుతిమించిపోయిన ప్రవర్తనతో కనిపించాడు . దీనిపై బహుమతి ప్రదానోత్సవంలో బంగ్లా కెప్టెన్ అక్బర్‌ను ప్రశ్నిస్తే.. "ఇలా జరగడం దురదృష్టకరం. మా బౌలర్లు కొందరు ఎక్కువ ఉద్వేగానికి గురయ్యారు. ఎక్కువ ఉత్సాహపడ్డారు" అన్నాడు.
ఇదీ చూడండి.. ప్రపంచకప్‌ను తొలిసారి ముద్దాడిన బంగ్లాదేశ్