ETV Bharat / sports

'ధోనీ.. ఈ జనరేషన్​ మొత్తానికే స్పూర్తి' - ధోనీ రిటైర్మెంట్

మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలుపై స్పందించిన ఐసీసీ.. అతడు జనరేషన్ మొత్తానికి స్పూర్తి కలిగించాడని తెలిపింది. మహీ భవిష్యత్తుకు ఆల్​ ది బెస్ట్ చెప్పింది.

'ధోనీ.. ఈ జనరేషన్​ మొత్తానికే స్పూర్తి'
మహేంద్ర సింగ్ ధోనీ
author img

By

Published : Aug 16, 2020, 9:10 PM IST

రిటైర్మెంట్ తీసుకున్న ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు విషెస్ చెబుతున్నారు. క్రికెట్​కు అతడు చేసిన సేవలు మర్చిపోలేనివి అంటూ కీర్తిస్తున్నారు. ఇదే విషయమై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి.. మొత్తం జనరేషన్​కే ధోనీ స్పూర్తి కలిగించాడని ప్రశంసించింది. మైదానంలో అతడిని కచ్చితంగా మిస్ అవుతామని చెప్పింది.

icc tweet on dhoni retairment
ధోనీ రిటైర్మెంట్​పై ఐసీసీ ట్వీట్

"క్రికెట్​లోని ఆల్​టైమ్ దిగ్గజాల్లో ధోనీ ఒకరు. 2011 ప్రపంచకప్​ ఫైనల్లో అతడు కొట్టిన విన్నింగ్ సిక్సర్​ను ప్రపంచవ్యాప్త క్రికెట్​ అభిమానుల జ్ఞాపకార్ధంగా ఉంచాలి. అతడు ప్రస్తుత జనరేషన్​ మొత్తానికి స్పూర్తి కలిగించాడు. కచ్చితంగా మహీని మిస్ అవుతాం. తన క్రికెట్ కెరీర్​ను అద్భుతంగా ముగించిన ధోనీకి ఐసీసీ తరఫున శుభాకాంక్షలు చెబుతున్నా. భవిష్యత్తుకు ఆల్​ ది బెస్ట్."

-మను సావ్నే, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్

39 ఏళ్ల ధోనీ.. దాదాపు 16 ఏళ్ల పాటు(2004-2020) భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు(2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ)లు గెల్చుకున్న ఏకైక కెప్టెన్ ధోనీనే​. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్​ సెమీస్​లో చివరగా ధోనీ కనిపించాడు. ఆ తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ధోనీ కెరీర్ గణాంకాలు

  1. 98 టెస్టుల్లో 4,876 పరుగులు.. 256 క్యాచ్​లు, 38 స్టంపింగ్​లు
  2. 350 వన్డేల్లో 10,773 పరుగులు.. 321 క్యాచ్​లు, 123 స్టంపింగ్​లు
  3. 98 టీ20ల్లో 1617 పరుగులు.. 57 క్యాచ్​లు, 34 స్టంపింగ్​లు
  4. వన్డేల్లో 10 శతకాలు, టెస్టుల్లో 6 సెంచరీలు
  5. 2006-2010 మధ్య కాలంలో 656 రోజులపాటు ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్​లో టాప్ ప్లేస్
  6. 2008, 09లలో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
  7. 2006, 08, 09, 10, 11, 12, 13లలో ఐసీసీ వన్డే జట్టులో సభ్యుడు
  8. 2009, 10, 12, 13లలో ఐసీసీ టెస్టు జట్టులో సభ్యుడు
  9. 2011 ఐసీసీ స్పిరిట్​ ఆఫ్ క్రికెట్ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.