ETV Bharat / sports

ధోనీ భవితవ్యంపై విశ్లేషకులు ఏమంటున్నారంటే!

టీ20 ప్రపంచకప్​లో ధోనీకి స్థానం ఉంటుందా? ధోనీ లేకుండా ప్రపంచకప్​లో టీమ్​ఇండియా ప్రదర్శన చూడగలమా? అనేవి క్రికెట్​ అభిమానులను ఇప్పటి వరకు తొలచిన సందేహాలు. గతేడాది ప్రపంచకప్​ తర్వాత సెంట్రల్​ కాంట్రాక్టు నుంచి తప్పుకోవడమే వీటన్నిటికీ కారణం. ఇవన్ని పక్కన పెడితే టీమ్​ఇండియా టాప్​ ఆటగాళ్ల కోసం బీసీసీఐ త్వరలో ఏర్పాటు చేసే శిక్షణా శిబిరానికి ధోనీని ఎంపిక చేస్తారా? లేదా? అనే అంశంపై కొత్త చర్చ నడుస్తోంది. ఈ క్యాంప్​లో ధోనీ చేరికపై ఉన్న అవకాశాలేంటో.. దీనిపై క్రికెట్​ విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Dhoni for India camp post lockdown? Experts divided
ధోనీ భవితవ్యంపై విశ్లేషకులు ఏమంటున్నారంటే!
author img

By

Published : Jun 20, 2020, 8:31 AM IST

జులైలో భారత టాప్​ క్రికెటర్లకు ఆరు వారాల క్యాంప్​ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). ఈ క్యాంప్​లో మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీకి అవకాశాన్ని కల్పిస్తారా? లేదా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని జులై మూడో వారం నుంచి ఈ శిబిరాన్ని నిర్వహించడానికి ఓ సురక్షిత వేదికను త్వరలోనే నిర్ణయించనుంది బీసీసీఐ. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఆటగాళ్లు వారి ఐపీఎల్​ శిక్షణా శిబిరాలకు వెళతారని తెలుస్తోంది.

Dhoni for India camp post lockdown? Experts divided
మహేంద్ర సింగ్​ ధోని

టీమ్​ఇండియా టాప్​ ఆటగాళ్లతో శిక్షణా శిబిరం ఏర్పాటు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంటే ధోనీని ఇందులో ఎంపిక చేస్తారా? లేదా? అనేది ఇప్పుడు అందర్ని తొలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే గతేడాది ప్రపంచకప్​ తర్వాత బీసీసీఐ ఒప్పందం నుంచి తొలగించడమే అందుకు కారణం. ధోనీని శిక్షణా శిబిరానికి బీసీసీఐ ఎంపిక చేస్తుందా.. అనే అంశంపై పలువురు క్రీడా విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసుకుందామా.

ఎమ్మెస్కే ప్రసాద్​

క్యాంప్​లో ధోనీ ఉండాలి

శిక్షణా శిబిరంలో ధోనీ ఉండడం వల్ల యువ కీపర్లను గైడ్​ చేయగలడని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్​. "టీ20 ప్రపంచకప్​ జరుగుతుందో లేదో నాకు స్పష్టత లేదు. ఒకవేళ అది జరిగితే టోర్నీకి ముందు శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తారు. అందులో ధోనీ కచ్చితంగా ఉండాలి. టీ20 ప్రపంచకప్ జరగకపోతే ద్వైపాక్షిక సిరీస్​ల కోసం ఇప్పటికే కేఎల్​ రాహుల్​, రిషబ్​ పంత్​, సంజు శాంసన్​ జట్టుకు అందుబాటులో ఉన్నారు" అని ఎమ్మేస్కే ప్రసాద్​ అన్నాడు.

ఆశిష్​ నెహ్రా

టీమ్​లో కచ్చితంగా ఉంటాడు

టీమ్​ఇండియా ఆడే ప్రతీ మ్యాచ్​లో ధోనీకి తప్పక స్థానం ఉండాలని ఆశిస్తున్నాడు మాజీ క్రికెటర్​ ఆశిష్​ నెహ్రా. "నేను అంతర్జాతీయ జట్టు సెలక్టర్​ అయితే జట్టులో ధోనీకి కచ్చితంగా స్థానం ఉంటుంది. కానీ, ప్రస్తుతం అతను ఆడటానికి సిద్ధంగా ఉన్నాడా? లేదా? అనేది పెద్ద ప్రశ్న. అది ధోనీ కోరుకునే దానిపై ఆధారపడి ఉంటుంది" అని నెహ్రా అన్నాడు. ఒకవేళ అంతర్జాతీయ జట్టులో రావాలని ధోనీ అనుకుంటే..ఐపీఎల్​ తన ఉత్తమ ప్రదర్శన కనబరిస్తే చాలని అభిప్రాయపడ్డాడు నెహ్రా.

ధోనీని పక్కన పెట్టగలమా!

బీసీసీఐ ఏర్పాటు చేసే శిక్షణా శిబిరంలో ధోనీకి ఉన్న ఆసక్తి గురించి సెలక్టర్లు ఒకసారి అతడితో మాట్లాడాలని టీమ్​ఇండియా మాజీ కీపర్​ దీప్​ దాస్​గుప్తా సూచించారు. "క్యాంప్​లో ధోనీ భాగమైతే భవిష్యత్​ కీపర్లను గైడ్​ చేస్తాడు. ఒకవేళ శిబిరంలో భాగం కాకపోతే ఐపీఎల్​ మరో మార్గంగా ఉంది. నాలుగో బ్యాటింగ్​ స్థానంలో బరిలో దిగి 500 పరుగులు చేసే ధోనీని జట్టు నుంచి పక్కన పెట్టగలరా?" అని దాస్​గుప్తా వెల్లడించాడు.

హర్భజన్​ సింగ్​

యువ ఆటగాళ్లకు ఛాన్స్​ ఇవ్వాలి

టీమ్​ఇండియా ఆటగాళ్లకు జులై శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తే.. అందులో యువ ఆటగాళ్లకు స్థానం కల్పించాలని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​. "క్యాంపులో సూర్యకుమార్​ యాదవ్​, అండర్​-19 లెగ్​ స్పిన్నర్​ రవి బిష్ణోయ్​, యశస్వీ జైశ్వాల్​లను చూడాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ శిబిరంలో వారు పాల్గొనడం వలన సీనియర్​ క్రికెటర్ల నుంచి పరస్పరం ఆట గురించి చర్చించుకునే అవకాశం వస్తుంది. భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకోవడానికి సూర్యకుమార్​ యాదవ్ అర్హుడు" అని హర్భజన్​ తెలిపాడు. ​

అలా జరిగితే ఆశ్చర్యమే!

ధోనీ ఈ క్యాంప్​కు ఎంపికైతే అంతకన్నా ఆశ్చర్యం మరోకటి ఉండదని కొంతమంది సీనియర్​ అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉన్న ఆటగాడు ధోనీ.. ప్రస్తుతం అతడి ఫిట్​నెస్​ స్థాయి తెలియకుండా శిక్షణా శిబిరానికి ఎలా ఎంపిక చేస్తారని అధికారులు అంటున్నారు. మరోవైపు బీసీసీఐ సెంట్రల్​ కాంట్రాక్టు నుంచి వైదొలగడం సహా గతేడాది వెస్డిండీస్​తో జరిగిన టీ20 మ్యాచ్​ల్లోనూ జట్టులో ఎంపిక చేయని పక్షంలో క్యాంపుకు ధోనీని ఎంపిక చేస్తే అంతకన్నా ఆశ్చర్యం మరోకటి ఉండదని విశ్లేషకులు అంటున్నారు.

ఇదీ చూడండి... 'ఆ మ్యాచ్​ కోసం బౌలర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.