ఎట్టకేలకు టీమిండియా డే/నైట్ టెస్టుకు ఓకే చెప్పింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య నవంబర్ 22న ఈ టెస్టు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు మంచు ప్రభావం పెద్ద సమస్యగా మారబోతుంది. దీనికోసం ఓ చిట్కా చెప్పాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్.
"డే/నైట్ టెస్టు గొప్ప ముందడుగు. మంచు ప్రభావం గురించి తప్పక ఆలోచించాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ బంతి తడిస్తే కొత్త బంతిని తీసుకోండి. ఆట నిబంధనలు మారుతున్నాయి. ఉదాహరణకు బ్రాడ్‌మన్ కాలంలో ఒక జట్టు 200 పరుగులు చేస్తే రెండో కొత్త బంతి ఇచ్చేవారు. మనం రాత్రిపూట ఆడుతున్నాం. ఒకవేళ బంతి తడిస్తే మార్చేయండి. నా దృష్టిలోనైతే ఇది తేలికైన పని. గంగూలీ టెస్టు క్రికెట్‌తో పాటు రాత్రిపూట క్రికెట్‌కు అభిమాని అని తెలుసు"
-డీన్ జోన్స్, ఆసీస్ మాజీ ఆటగాడు
భవిష్యత్ అంతా గులాబి టెస్టులదే అన్నాడు జోన్స్. అలవాటు పడితే సులభంగానే ఉంటుందని తెలిపాడు
"రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా గులాబి టెస్టులదే. ప్రస్తుతం ప్రజలు బిజీగా గడుపుతున్నారు. గులాబి టెస్టులకు ఆస్ట్రేలియాలో రేటింగ్స్ బాగున్నాయి. సంప్రదాయ టెస్టులతో పోలిస్తే ఎంత భారీస్థాయిలో ఉన్నాయో చెప్పలేను. బిజీగా ఉండటంతో పగటి పూట టెస్టు క్రికెట్ చూడటం జనాలకు కష్టమవుతోంది. గులాబి బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అలవాటు పడితే సులభంగానే ఉంటుంది."
-డీన్ జోన్స్, ఆసీస్ మాజీ ఆటగాడు
గులాబి బంతి టెస్టుపై మాజీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మంచు లేకపోతే గులాబి టెస్టుకు ఎలాంటి ఆటంకం ఉండదని సచిన్ అన్నాడు.
ఇవీ చూడండి.. స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్‌తో రోహిత్..!