న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయల బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీకి ఫిర్యాదు అందింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో వీరి బౌలింగ్ సరళిపై అనుమానం వ్యక్తం చేసిన మ్యాచ్ రిఫరీ ఈ విషయమై ఐసీసీకి ఫిర్యాదు చేశారు.
ఇద్దరూ 14 రోజుల్లో ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలింగ్ యాక్షన్‌పై పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ కాలంలో వారిద్దరూ యథాతథంగా బౌలింగ్ చేసుకోవచ్చు. ఒకవేల యాక్షన్ విరుద్ధంగా ఉందని తేలితే వీరి బౌలింగ్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది.
-
🇳🇿's Kane Williamson and 🇱🇰's Akila Dananjaya have been reported for suspect bowling action after the first Test in Galle.https://t.co/mYHAaIs1vu
— ICC (@ICC) August 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">🇳🇿's Kane Williamson and 🇱🇰's Akila Dananjaya have been reported for suspect bowling action after the first Test in Galle.https://t.co/mYHAaIs1vu
— ICC (@ICC) August 20, 2019🇳🇿's Kane Williamson and 🇱🇰's Akila Dananjaya have been reported for suspect bowling action after the first Test in Galle.https://t.co/mYHAaIs1vu
— ICC (@ICC) August 20, 2019
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తాచాటాడు ధనంజయ. రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఇవీ చూడండి.. ఒక సిరీస్, ఇద్దరు సారథులు, రెండు జట్లు