చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్ సహా 13 మంది సిబ్బంది కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మిగతా ఆటగాళ్లు సహా సిబ్బందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయగా.. వారికి నెగిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటికే ఇబ్బందులతో సతమతమవుతోన్న సీఎస్కేకు కాస్త ఊరట లభించినట్లైంది.
అయితే వీరికి మరోసారి సెప్టెంబరు 3న పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది ఫ్రాంచైజీ. ఇందులో నెగిటివ్‌గా తేలితేనే మైదానంలో ప్రాక్టీస్టు సెషన్‌కు అనుమతిస్తామని వెల్లడించింది. అనంతరం వీరిని బయోబబుల్ వాతావరణంలోకి అనుమతిస్తారు.
కాగా ఇప్పటికే తన తల్లి అనారోగ్యం వల్ల సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ దుబాయ్‌కు రాలేదు. అయితే ఇతడు యూఏఈకి చేరుకుని జట్టులో చేరడానికి మరికొన్ని రోజులు పడుతుందని స్పష్టం చేసింది యాజమాన్యం. ఇప్పటికే జట్టు వైస్ కెప్టెన్ సురేశ్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఈ మెగాలీగ్ జరగనుంది.