ETV Bharat / sports

జాదవ్​ను వదిలేస్తున్న సీఎస్కే! - కేదార్ జాదవ్​ చెన్నై సూపర్ కింగ్స్

ఒకప్పుడు బ్యాటు, బంతితో టీమ్ఇండియాకు అండగా నిలిచిన ఆల్​రౌండర్ కేదార్ జాదవ్ కొంతకాలంగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్నాడు. గతేడాది ఐపీఎల్​లో దారుణంగా నిరాశపరిచాడు. దీంతో అతడిని చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది వదులుకోనుందని సమాచారం.

CSK releasing Allrounder Kedar Jadhav
జాదవ్​ను వదిలేస్తున్న సీఎస్కే
author img

By

Published : Jan 8, 2021, 10:54 AM IST

Updated : Jan 8, 2021, 11:14 AM IST

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంచైజీ 2021 సీజన్‌ కోసం భారీ కసరత్తు మొదలు పెట్టింది. రానున్న సీజన్లో యువకులపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన ఘన వారసత్వాన్ని చాటాలన్న దృఢ సంకల్పంతో ఉందని తెలిసింది. ఎంఎస్‌ ధోనీ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చేస్తోందని సమాచారం. ఇందులో భాగంగానే సీనియర్‌ ఆటగాడు కేదార్‌ జాదవ్‌ను వదిలేస్తోందని అభిజ్ఞవర్గాలు అంటున్నాయి.

ఒకప్పుడు బంతి, బ్యాటుతో టీమ్‌ఇండియాకు అండగా నిలిచిన జాదవ్ మూడేళ్లుగా రాణించడం లేదు. వరుసగా గాయాల పాలవుతున్నాడు. జట్టులో అవకాశం ఇచ్చినా దూకుడుగా ఆడలేకపోతున్నాడు. 2018లో చెన్నై రూ.7.8 కోట్లు వెచ్చించి వేలంలో అతడిని కొనుగోలు చేసింది. అప్పట్నుంచి అతడి ప్రదర్శన జట్టుకు ఏమాత్రం సాయపడలేదు. 2020లో అతడి ఆటతీరు మరీ తీసికట్టుగా మారింది. ఎనిమిది మ్యాచులాడి 62 పరుగులే చేశాడు. విశ్లేషకుల నుంచి అభిమానుల వరకు అతడిని తెగ విమర్శించారు. జాదవ్‌తో పాటు మరికొందరి భారాన్ని తొలగించుకొనేందుకు చెన్నై సిద్ధమైందని సమాచారం.

"ఐపీఎల్‌-2020లో జాదవ్‌ అత్యుత్తమ ఫామ్‌లో లేడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. 2021లో సీఎస్‌కే అతడిని వద్దనుకుంటోంది. భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే సరైన నిర్ణయమని జట్టు యాజమాన్యమూ భావిస్తోంది" అని సీఎస్కే వర్గాలు అంటున్నాయి. కాగా జనవరి 21 కల్లా వదిలేసిన ఆటగాళ్ల జాబితాను ఇవ్వాలని అన్ని ఫ్రాంచైజీలను బీసీసీఐ కోరింది. తెలిసింది. ఫిబ్రవరి 11న మినీ వేలం ఉంటుందని సమాచారం.

Last Updated : Jan 8, 2021, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.