ETV Bharat / sports

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సురేశ్ రైనా - undefined

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సురేశ్ రైనా

author img

By

Published : Aug 15, 2020, 8:37 PM IST

Updated : Aug 15, 2020, 9:26 PM IST

20:36 August 15

మహీ అడుగుజాడల్లోనే క్రికెట్​కు రైనా టాటా

టీమ్​ఇండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. భారత మాజీ కెప్టెన్‌ ధోనీ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించడం గమనార్హం.
 
"ధోనీ నీతో కలిసి ఆడడం ఓ మధురానుభూతి.. ఈ ప్రయాణంలో నేనూ మీతో చేరాలని నిర్ణయించున్నా. జైహింద్‌" అంటూ  ధోనీతో కలిసి ఉన్న చిత్రాన్ని జతచేసి రైనా తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.
 
దంబుల్లా వేదికగా 2005, జులై 30న శ్రీలంకతో జరిగిన వన్డేతో రైనా అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఎన్నో పరుగులు సాధించాడు. కెరీర్‌లో చిరస్మరణీయ ఘనతలు అందుకున్నాడు. తన అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలతో అబ్బురపరిచాడు. 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీని రైనా అందుకున్నాడు. ఇప్పటి వరకు 226 వన్డేల్లో 5,616 పరుగులు చేశాడు.78 టీ20లు, 18 టెస్టులు ఆడాడు. 2018 నుంచి అతడు జట్టులోకి ఎంపికవ్వలేదు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన రైనా.. ఈ ఏడాది ఐపీఎల్‌లో కనువిందు చేయనున్నాడు

Last Updated : Aug 15, 2020, 9:26 PM IST

For All Latest Updates

TAGGED:

.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.