ETV Bharat / sports

స్మిత్​కు కెప్టెన్సీ​.. ఆసీస్ బోర్డు ఏమంటోంది? - ఎర్ల్ ఎడ్డింగ్స్

భవిష్యత్​ సారథి గురించి ఏం చర్చించట్లేదని ఆస్ట్రేలియా బోర్డు ఛైర్మన్​ ఎడ్డింగ్స్ స్పష్టం చేశారు. కొత్త కెప్టెన్​ను ఎంపిక చేయాల్సి వస్తే స్మిత్​తో పాటు చాలామంది సమర్థవంతమైన ఆటగాళ్ల పేర్లను పరిశీలిస్తామని చెప్పారు.

Cricket Australia opens up about Steve Smith leading Australia again
స్టీవ్ స్మిత్.. మరోసారి కెప్టెన్​ కావడం కష్టమేనా?
author img

By

Published : Dec 22, 2020, 5:52 PM IST

ఆస్ట్రేలియా స్టార్​ బ్యాట్స్​మన్ స్టీవ్​ స్మిత్​.. మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం అనుమానంగా కనిపిస్తోంది. భవిష్యత్​ సారథిగా స్మిత్​​ మాత్రమే కాకుండా మరికొందరు యువ ఆటగాళ్ల పేర్లను పరిశీలిస్తున్నామని ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ ఎర్ల్​ ఎడ్డింగ్స్ అన్నారు​. తమ దగ్గర సమర్థవంతమైన వాళ్లు చాలామంది ఉన్నారని చెప్పారు.

"ప్రస్తుతం మెగ్, ఫించ్, టిమ్ పైన్ రూపంలో అద్భుతమైన కెప్టెన్​లు ఉన్నారు. ఉత్సాహవంతమైన యువ సారథులు వెలుగులోకి వస్తున్నారు. కాబట్టి స్మిత్​ను తీసుకోవాలా వద్దా అనేది ఆలోచించే కన్నా అత్యుత్తమం ఎవరనే దానిపైనే దృష్టిసారించాలి. స్మిత్ గొప్ప ఆటగాడు. అతడు కెప్టెన్​గా బాధ్యతలు చక్కగా నిర్వర్తించాడు. భవిష్యత్తు సారథిగా ఎవరిని నియమించాలనే విషయమై ప్రస్తుతం మేం చర్చించట్లేదు. ఒకవేళ కెప్టెన్​ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అందుకోసం ఏమి చేయాలో మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి"

-- ​ ఎర్ల్ ఎడ్డింగ్స్, క్రికెట్​ ఆస్ట్రేలియా ఛైర్మన్​

2018లో బాల్​ ట్యాంపరింగ్​ వివాదంతో ఏడాది పాటు ఆటకు, కెప్టెన్సీకి స్మిత్​ దూరమయ్యాడు. 2019 ప్రపంచకప్​తో అతడు పునరాగమనం చేయగా.. కెప్టెన్సీ నిషేధం ఈ ఏడాది మార్చితో ముగిసింది. ప్రస్తుతం భారత్​తో టెస్టు సిరీస్​లో​ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కెప్టెన్సీ విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

ఇదీ చూడండి: టీమ్​ఇండియాకు సలహా.. కోహ్లీకి స్మిత్ మద్దతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.