ETV Bharat / sports

భారత పర్యటనపై ఆస్ట్రేలియా ఆశాభావం

ఈ ఏడాది చివర్లో టీమ్​ఇండియాతో జరిగే నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ నిర్వహణపై ఆశాభావం వ్యక్తం చేస్తోంది క్రికెట్​ ఆస్ట్రేలియా. ప్రణాళిక ప్రకారం సిరీస్​ జరిపి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది.

Cricket Australia CEO optimistic about India touring Australia
భారత పర్యటనపై ఆశాభావం వ్యక్తం చేసిన క్రికెట్​ ఆస్ట్రేలియా
author img

By

Published : May 22, 2020, 4:57 PM IST

టీమ్​ఇండియాతో ఈ ఏడాది జరగాల్సిన నాలుగు టెస్టుల సిరీస్​ను కచ్చితంగా నిర్వహించాలనుకుంటోంది క్రికెట్​ ఆస్ట్రేలియా. దాని కోసం కరోనా వల్ల కలిగే అనిశ్చితిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ దేశ క్రికెట్​ బోర్డు ముఖ్యనిర్వహణ అధికారి కెవిన్​ రాబర్డ్స్ తెలిపారు​.

క్రికెట్​ ఆస్ట్రేలియా(సీఏ) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తోంది. దీంతో భారత్​తో టెస్టు సిరీస్​ నిర్వహణ వల్ల ప్రసార హక్కులతో వచ్చే దాదాపు రూ.15 వందల కోట్లతో ఆర్థిక లోటును భర్తీ చేసుకోవాలని సీఏ యోచిస్తోంది. ప్రణాళిక ప్రకారం ఈ టోర్నీ నవంబరు 2020 నుంచి జనవరి 2021 మధ్య జరగాల్సి ఉంది.

"ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి లేదని నేను భావిస్తున్నా. ఏదీ ఏమైనా భారత పర్యటన వాయిదా పడితే నేను నిజంగా ఆశ్చర్యపోతా. భవిష్యత్​లో ఏమి జరుగుతుందో చూడాలి".

-కెవిన్​ రాబర్ట్స్, క్రికెట్​ ఆస్ట్రేలియా సీఈఓ

విదేశీ పర్యటనలకు బయో-సెక్యూర్​ వాతావరణంలో క్రికెటర్లను పంపాలని కోరుకుంటోంది క్రికెట్​ ఆస్ట్రేలియా. ముందుగా పాకిస్థాన్​, వెస్టిండీస్​, ఇంగ్లాండ్​ పర్యటనల్లో ఆరోగ్య భద్రతా చర్యలు ఎలా సాగుతాయో పరిశీలించనుంది.

ఇదీ చూడండి.. శ్రీలంకలో అతిపెద్ద స్టేడియం నిర్మాణానికి బ్రేక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.