ETV Bharat / sports

'ఐపీఎల్​లో ఆడాలా? వద్దా? అనేది ఆటగాళ్ల నిర్ణయం' - New Zealand Cricket Clears The Air On Players' Participation In IPL 2020

కరోనా ప్రభావం కారణంగా ఐపీఎల్ వాయిదాపడింది. ఈ లీగ్​లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లు రావడంపై సందిగ్ధం నెలకొంది. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాత్రం లీగ్​లో ఆడాలా? వద్దా? అనే నిర్ణయాన్ని ఆటగాళ్లకే వదిలేసింది.

విలియమ్సన్
విలియమ్సన్
author img

By

Published : Mar 14, 2020, 8:32 AM IST

కరోనా ప్రభావంతో ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్) వాయిదా పడింది. ఈనెల 29న ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీ... వచ్చే నెల 15 నుంచి మొదలు కానుంది. విదేశీ క్రికెటర్ల ఇక్కడికి వచ్చే విషయం మాత్రం సందిగ్ధంలోనే ఉంది. పలు దేశాల బోర్డులు తమ ఆటగాళ్లను పంపించాలా? వద్దా? అని పునరాలోచనలో పడ్డాయి. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ నిర్ణయాన్ని క్రికెటర్లకే వదిలేసింది.

"మన పరిస్థితి ఇంకా ఏం మారలేదు. ప్రభుత్వం, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాలకు అనుగుణంగా నడుచుకుంటాం. ఇక ఐపీఎల్​లో ఆడాలా? వద్దా? అనే విషయాన్ని ఆటగాళ్లే నిర్ణయించుకుంటారు."

-న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు

కరోనా ప్రభావం వల్ల ఐపీఎల్ మ్యాచ్​లను నిర్వహించేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల క్రికెట్ సంఘాలు విముఖత వ్యక్తం చేశాయి. మరికొన్ని ఆలోచనలో పడ్డాయి. కర్ణాటక, దిల్లీలో మ్యాచ్​లను నిర్వహించే వీలులేదని అక్కడి ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. మహారాష్ట్ర అదే దారిలో ఉంది. అందువల్ల ఐపీఎల్​ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ పాలక మండలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.