టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించి రోహిత్ శర్మను నియమిస్తారని గత కొన్నిరోజులుగా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై వస్తున్న వార్తలపై మాట్లాడటానికి నిరాకరించారు బీసీసీఐ పాలకమండలి చీఫ్ వినోద్ రాయ్. ఈ కథనాలు సృష్టించింది మీడియానే అని అసహనం వ్యక్తంచేశారు.
"కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలు సృష్టించింది మీరే(మీడియా). వీటి గురించి మాట్లాడదల్చుకోలేదు" -బీసీసీఐ సీఓఏ వినోద్‌రాయ్
ప్రపంచకప్-2019 సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది భారత్. ఈ కారణంగా కోహ్లీ నుంచి కెప్టెన్సీని రోహిత్‌కు అప్పగించాలని ఊహాగానాలు వచ్చాయి. ఈ వదంతులపై రోహిత్, కోహ్లీ ఇద్దరూ స్పందించలేదు.
ఇది చదవండి: ఆగస్టులో టీమిండియా కొత్త కోచ్ ప్రకటన