ఐపీఎల్ ప్రారంభ సీజన్ వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్.. స్వరాష్ట్రానికి చెందిన తనను పక్కన పెట్టి ధోనీని తీసుకోవడం తనను ఎంతగానో కలచివేసిందని చెప్పాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రస్తుత సారథి దినేశ్ కార్తీక్. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
"2008 ఐపీఎల్ వేలం జరుగుతున్నప్పుడు తమిళనాడుకు చెందిన క్రికెటర్లలో నేను గొప్ప ఆటగాడిని. అప్పుడు నా పేరు ప్రధానంగా వినిపించింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్.. నన్ను ఎంపిక చేసుకుంటుందనే అనుకున్నా. కానీ అనూహ్యంగా 1.5 మిలియన్లకు వారు ధోనీని కొనుగోలు చేశారు. అతడు నా పక్కనే ఉన్నా.. ఆ విషయం నాకు చెప్పలేదు. కనీసం తర్వాత సీజన్లోనైనా నన్ను జట్టులోకి తీసుకుంటారని ఎదురుచూశా. అలా 13 ఏళ్లు గడిచిపోయాయి. అయినా నన్ను తీసుకుంటారనే ఆశతో ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నా" -దినేశ్ కార్తీక్, కేకేఆర్ సారథి
ఐపీఎల్లో ఇప్పటివరకూ ముంబయి ఇండియన్స్, దిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్ల తరఫున ఆడాడు కార్తీక్. ప్రస్తుతం కేకేఆర్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ లీగ్ 13వ సీజన్ నిరవధిక వాయిదా పడింది.
ఇదీ చూడండి : తనయుడితో ధావన్ డ్యాన్స్.. వీడియో వైరల్