టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ శైలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. భిన్నమైన శైలి బౌలింగ్‌తో ఆకట్టుకునే ఈ పేసర్ వేసే యార్కర్లను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు సవాలు లాంటిది. ఈ మధ్య స్వింగ్‌లోనూ సత్తాచాటుతున్న బుమ్రా ఎక్కువ కాలం మూడు ఫార్మాట్లో నిలదొక్కుకోవడం కష్టమని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.
"బుమ్రాది భిన్నమైన శైలి. అతడు అన్ని ఫార్మాట్లలో ఆడకూడదు. టెస్టు మ్యాచ్‌ల్లోనూ రాణించడమనేది అతడి ధైర్యానికి నిదర్శనం. అతడు చాలా కష్టపడుతూ, ఆటపై శ్రద్ధ పెడతాడు. ఏం సాధించాలనుకుంటున్నాడో అతడికి తెలుసు. కానీ అతడి వెన్ను సపోర్ట్ చేసినంతవరకే అది వీలవుతుంది. కానీ మూడు ఫార్మాట్లలో ఆడటం వల్ల అతడి వెన్నుముకపై అధిక భారం పడి దెబ్బతినే అవకాశం ఉంది."
-షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ పేసర్
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌తో టెస్టు అరంగేట్రం చేసిన బుమ్రా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. 2019లో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడీ పేసర్.