Most Affordable 400cc Class Bikes: ఇండియన్ మార్కెట్లో 400cc బైక్ సెగ్మెంట్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ విభాంగంలో మోటార్‌సైకిళ్లు భారీ డిమాండ్‌తో సేల్స్‌లో దూసుకుపోతున్నాయి. చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్‌లను 400cc విభాగంలో విక్రయిస్తున్నాయి. మార్కెట్లో వీటి ధరలు రూ. 1.80 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ సెగ్మెంట్లో ఓ మంచి బైక్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ స్టోరీ. దేశీయ మార్కెట్లో 400cc సెగ్మెంట్‌లో మోస్ట్ అఫర్డబుల్ టాప్-7 బైక్‌ల వివరాలు మీకోసం.
7. Triumph Speed 400:
![Triumph Speed 400](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-01-2025/23242432_speed400.jpg)
'ట్రయంఫ్ స్పీడ్ 400' అఫర్డబుల్ రోడ్‌స్టర్‌ను బజాజ్, ట్రయంఫ్ భాగస్వామ్యంలో విక్రయిస్తున్నారు. ఇటీవల దీన్ని MY25కి అప్డేట్ చేశారు. రీసెంట్గా లాంఛ్ చేసిన '2025 స్పీడ్ 400' ధర రూ. 2.4 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్‌లో 398.15cc, సింగిల్-సిలిండర్ DOHC 4V/సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 39.5 bhp పవర్, 37.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
6. Harley-Davidson X440:
![Harley-Davidson X440](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-01-2025/23242432_x440.jpg)
హార్లే-డేవిడ్సన్ ప్రీమియం, ఎక్స్పెన్సివ్ బైక్‌లకు ప్రసిద్ధి చెందినప్పటికీ .. 'హార్లే-డేవిడ్సన్ X440' రిలీజ్‌తో కంపెనీ పూర్తిగా కొత్త ధరల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. కంపెనీ ఇండియన్ మార్కెట్లో 'X440' బైక్‌ను రూ. 2.39 లక్షల నుంచి రూ. 2.79 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో విక్రయిస్తోంది. ఇందులో 440cc ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 27 bhp పవర్, 38 Nm టార్క్‌ను అందిస్తుంది.
5. Royal Enfield Guerrilla 450:
![Royal Enfield Guerrilla 450](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-01-2025/23242432_guerrilla.jpg)
ఇండియన్ మార్కెట్లో 'రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450' బైక్ 2024 ప్రారంభంలో లాంఛ్ అయింది. మన దేశంలో మోస్ట్ అవైటెడ్ మోటార్‌సైకిల్స్‌లో ఇది ఒకటి. కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను కొత్త 'షెర్పా 450' ప్లాట్‌ఫారమ్‌లో బిల్డ్ చేసింది. దీని కారణంగా ఈ బైక్ ధర రూ. 2.39 లక్షల నుంచి రూ. 2.54 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. 'హిమాలయన్ 450' మోడల్ మెయిన్ ఫీచర్లతో పోలిస్తే ఈ 'గెరిల్లా 450' లైట్ వెయిట్లో అఫర్డబుల్ ప్రైస్‌ను కలిగి ఉంది.
4. Bajaj Dominar 400:
![Bajaj Dominar 400](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-01-2025/23242432_dominar.jpg)
దేశీయ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ బజాజ్ ఆటో 'డొమినార్ 400' బైక్ ఈ 400cc సెగ్మెంట్ లిస్ట్‌లో నాల్గో స్థానంలో ఉంది. అయితే ఇది దాని ఓల్డెస్ట్ మోడల్. అయినప్పటికీ కంపెనీ తన అప్పీల్ చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకుంది. దీంతో వినియోగదారులు దాని వైపు ఆకర్షితులవుతున్నారు. 'బజాజ్ డొమినార్ 400' ఫుల్లీ లోడెడ్ ఫీచర్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది స్టాండర్డ్‌గా అనేక టూరింగ్ యాక్సెసరీస్‌తో వస్తుంది. ఇక ఈ బైక్ 373cc KTM-డెరివైడ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 40 bhp పవర్, 35 Nm టార్క్‌ను అందిస్తుంది.
3. Triumph Speed T4:
![Triumph Speed T4](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-01-2025/23242432_speedt4.jpg)
'స్పీడ్ T4' ప్రారంభంతో భారత్‌లో 400cc విభాగంలో ట్రయంఫ్ కొత్త ప్రైజ్ పాయింట్‌ను చేరుకుంది. ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 1.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విక్రయిస్తున్నారు. ఈ మోటార్‌సైకిల్‌లో మాన్యువల్ థొరెటల్, RSU టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, సన్నని టైర్లతో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి. దీని ఇంజిన్ 30.6 bhp పవర్, 36 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
2. Hero Mavrick 440:
![Hero Mavrick 440](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-01-2025/23242432_mavrick7.jpg)
ఈ బైక్‌ను 'హార్లే-డేవిడ్సన్ X440'కు చెందిన ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. దీని ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇక ఈ మోటార్‌సైకిల్ టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 2.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 'X440' మాదిరిగానే 440cc ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఇంజిన్ 27 bhp శక్తిని, 38 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
1. Bajaj Pulsar NS400Z:
![Bajaj Pulsar NS400Z](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-01-2025/23242432_pulsar.jpg)
ఇండియన్ మార్కెట్లో 'బజాజ్ పల్సర్ NS400Z' మోటార్‌సైకిల్ ఈ 400cc సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే ఈ బైక్ అత్యంత సరసమైన ధరలో లభిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 1.85 లక్షల (ఎక్స్-షోరూమ్). ఇది 373సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 'KTM 390 అడ్వెంచర్'లో కూడా ఇదే ఇంజిన్ ఉపయోగించారు. ఇక 'పల్సర్ NS400Z' ఈ ఇంజిన్ 39.5 bhp పవర్, 35 Nm టార్క్‌ను అందిస్తుంది.
జియో, ఎయిర్‌టెల్‌తో పోటీకి వొడాఫోన్ ఐడియా రెడీ- త్వరలో 5G సేవలు!
USB-C పోర్ట్, యాపిల్ మోడెమ్, న్యూ డిజైన్‌తో 'ఐఫోన్ SE 4'- ధర ఎంత ఉంటుందంటే?
ధర తక్కువ- బెనిఫిట్స్ ఎక్కువ: BSNL నుంచి మరో రెండు చౌకైన ప్లాన్లు- డైలీ 3GB డేటాతో పాటు మరెన్నో!
క్రెటా ఈవీని ఆవిష్కరించిన హ్యుందాయ్- సింగిల్ ఛార్జ్‌తో 473కి.మీ రేంజ్- ఫస్ట్‌లుక్ చూశారా?