ETV Bharat / sports

ఐపీఎల్​ కచ్చితంగా జరుగుతుంది: అజారుద్దీన్​ - ఐపీఎల్​

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. క్రికెట్​ అభిమానులు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఐపీఎల్​ వాయిదా పడింది. అయితే ఈ టోర్నీలన్నీ మళ్లీ నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్​. దీనిపై అన్ని దేశాల క్రికెట్​ బోర్డులు ముందుకొచ్చి తగిన ప్రణాళిక రూపొందాల్సిన అవసరం ఉందన్నాడు.

Believe FTP for next two years should be reworked: Azharuddin
ఐపీఎల్​ కచ్చితంగా జరుగుతుంది: అజారుద్దీన్​
author img

By

Published : Apr 12, 2020, 2:42 PM IST

కరోనా కారణంగా వాయిదా పడిన టోర్నీలను నిర్వహించడానికి ప్రణాళిక వేయాలని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహ్మద్​ అజారుద్దీన్. అంతర్జాతీయ క్యాలెండర్​ను తిరిగి రూపొందించేందుకు అన్ని క్రికెట్ బోర్డులు కలిసి రావాలని అతడు కోరాడు.​​ దేశ, విదేశీ ఆటగాళ్లకు ముఖ్యమైన ఐపీఎల్​కు అనుగుణంగా భవిష్యత్​ టోర్నీల్లో (ఫ్యూచర్​ టూర్స్​ అండ్​ ప్రోగ్రామ్స్​ (ఎఫ్​టిపి)) మార్పు జరగాలన్నాడు.

"ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్​ క్రికెట్​ టోర్నీల ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఊహించలేదు. కాబట్టి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత అన్ని దేశాల క్రికెట్​ బోర్డులతో చర్చించి వాయిదా పడిన టోర్నీలతో సహా ఐపీఎల్​ను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టోర్నీల నిర్వహణలో అన్ని బోర్డులు సహకరిస్తాయని భావిస్తున్నా."

-మహ్మద్​ అజారుద్దీన్​, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​

ఐపీఎల్​ కచ్చితంగా ఈ ఏడాదిలోనే నిర్వహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు అజారుద్దీన్​. అక్టోబరు నుంచి జరగాల్సిన టీ20 ప్రపంచకప్​కు ఎలాంటి అవాంతరాలు ఎదురుకావని.. అప్పటికి ఈ సంక్షోభం ముగుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

పలు రాష్ట్రాల్లో ఈ నెలాఖరుకు కరోనా లాక్​డౌన్ పొడిగించిన​ కారణంగా ఏప్రిల్​ 15కు వాయిదా వేసిన ఐపీఎల్​ టోర్నీని నిరవధిక వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. దీనిపై బీసీసీఐ త్వరలోనే ఓ ప్రకటన చేయనుందని సమాాచారం.

ఇదీ చూడండి.. నా కెరీర్​లో అదే ఉత్తమ సెంచరీ: అజహర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.