ETV Bharat / sports

న్యూజిలాండ్-బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ వాయిదా - bangladesh cricket board news

బంగ్లాదేశ్​, న్యూజిలాండ్​ మధ్య ఆగస్టులో జరగాల్సిన టెస్టు సిరీస్​ కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సిరీస్​ను వాయిదా వేస్తున్నట్లు బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు ప్రకటన చేసింది.

Bangladesh's home Test series vs New Zealand postponed due to coronavirus pandemic
న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​ను వాయిదా వేసిన బంగ్లాదేశ్​
author img

By

Published : Jun 23, 2020, 4:03 PM IST

కరోనా సంక్షోభం కారణంగా మరో ద్వైపాక్షిక సిరీస్​ వాయిదా పడింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా ఆగస్టు-సెప్టెంబరులో జరగాల్సిన రెండు టెస్టుల కోసం న్యూజిలాండ్​.. బంగ్లాదేశ్​ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ వల్ల టోర్నీని వాయిదా వేస్తున్నట్లు తాజాగా బంగ్లాదేశ్​ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

"ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఈ సిరీస్​ను నిర్వహించడం సవాలుతో కూడుకున్నది. మ్యాచ్​లు జరిగే క్రమంలో ఆటగాళ్ల ఆరోగ్య భద్రతలో రాజీ పడలేం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిరీస్​ను వాయిదా వేయాలని ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు కలిసి నిర్ణయించాం ".

- బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు

కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్​, శ్రీలంక మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్​ను ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు ఇటీవలే రద్దు చేశాయి.

బంగ్లాదేశ్​ మాజీ క్రికెటర్​ మష్రఫే మొర్తజాతో పాటు స్పిన్నర్​ నజ్​ముల్​ ఇస్లాం, ఓపెనర్​ నఫీజ్​ ఇక్బాల్​కు కరోనా సోకినట్లు ఇటీవలే నిర్ధారణ అయ్యింది. ఇంగ్లాండ్​ టూర్​కు వెళ్లాల్సిన పాకిస్థాన్​కు చెందిన ముగ్గురికి ఈ మహమ్మారి సోకినట్లు తాజాగా వెల్లడైంది. దీంతో క్రికెట్ ప్రపంచం ఆటగాళ్ల భద్రత విషయంలో అప్రమత్తమైంది.

ఇదీ చూడండి... 'బుమ్రా, హార్దిక్​ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.