కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈనెల 22న చారిత్రక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
బంగ్లా డిప్యూటీ హైకమిషనర్ బృందం మంగళవారం ఈడెన్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది. మ్యాచ్ ఆరంభానికి ఒక రోజు ముందు భారత్‌కు రాబోతున్న హసీనా.. మమతతో కలిసి గంట కొట్టి టెస్టును ప్రారంభించనున్నారు.
రెండు టెస్టుల సిరీస్‌లో గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: బ్యాడ్మింటన్ టాప్-10 ర్యాంకింగ్స్‌లో సాత్విక్-చిరాగ్