బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచింది పాకిస్థాన్. ఈ విజయానికి కారణమైన బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్‌పై ప్రశంసలు కురిపించాడు జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్. పరుగుల యంత్రం, భారత సారథి కోహ్లీ స్థాయిని అతడు ఏదో ఒక రోజు అందుకుంటాడన్నాడు.
"బాబర్ ప్రత్యేక క్రికెటర్. పాకిస్థాన్ తరఫున ఆడిన వారిలో అతడు అత్యుత్తమ క్రికెటర్‌గా పేరు తెచ్చుకుంటాడు. అద్భుత క్రికెట్ కెరీర్ బాబర్ అజామ్‌కు ఉంది. పరుగులు చేయాలనే ఆకలితో ఉన్న అతడు ఏదో ఒకరోజు విరాట్ స్థాయిని అందుకుంటాడు." -గ్రాంట్ ఫ్లవర్, పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది పాకిస్థాన్. 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన బాబర్ అజామ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఘనతను 68 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడీ బ్యాట్స్‌మెన్. ఇతడి కంటే ముందు హషీమ్ ఆమ్లా ఉన్నాడు.
బాబర్ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని అయినప్పటికీ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని పొగడ్తలు కురిపించాడు గ్రాంట్ ఫ్లవర్.
ఇది చదవండి: మనసు మార్చుకున్న గేల్- విండీస్ కెప్టెన్ ఆనందం