ETV Bharat / sports

హెచ్​సీఏ భేటీ రసాభాస.. అజహర్-అర్షద్​ల వాగ్వాదం

author img

By

Published : Mar 29, 2021, 6:25 AM IST

హైదరాబాద్ క్రికెట్ సంఘ సమావేశం గందరగోళం సాగి, అసంపూర్తిగా ముగిసింది. హెచ్​సీఏ అధ్యక్షుడు అజహారుద్దీన్, మాజీ క్రికెటర్ అర్షద్ మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Azharuddin, Ayub fight at Hyderabad Cricket Association meet
హెచ్​సీఏ భేటీ రసాభాస.. అజహర్-అర్షద్ మాటల యుద్ధం

"నువ్వో మ్యాచ్‌ ఫిక్సర్‌".. "నువ్వో మోసగాడివి".. "నువ్వు దేశాన్ని అమ్మేశావ్‌".. "నువ్వు హెచ్‌సీఏను దోచుకున్నావ్‌".. "నీపై క్రిమినల్‌ కేసులు".. "నీపై ఏసీబీ కేసులు".. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో వినిపించిన మాటలివి! అవినీతి, అక్రమాల్లో హెచ్‌సీఏ కూరుకుపోయిందని అందరికీ తెలుసు. హెచ్‌సీఏ పరిపాలన గాడితప్పడం చూస్తున్నాం. ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుండటం గమనిస్తున్నాం. క్రికెట్‌ భవిష్యత్తు ప్రమాదంలో పడటంపై ఆందోళన చెందుతున్నాం. ఇప్పుడు హెచ్‌సీఏ పెద్దలు, టీమ్‌ఇండియా టెస్టు క్రికెటర్లు కూడా కట్టుతప్పారు! హెచ్‌సీఏ ఏజీఎంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. నువ్వు ఫిక్సర్‌.. నువ్వు దొంగ అంటూ తిట్టుకున్నారు. క్రికెట్‌ అజెండాగా సాగాల్సిన ఏజీఎం కాస్తా వ్యక్తిగత విమర్శలకు వేదికగా మారింది.

పోలీసుల భద్రత.. ఆరోపణలు.. విమర్శల నడుమ హెచ్‌సీఏ ఏజీఎం రసాభాసగా మారింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహారుద్దీన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏజీఎం అసంపూర్తిగా ముగిసింది. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకం విషయంలో మొదలైన గొడవ చినికి చినికి గాలివానగా తయారైంది. దీపక్‌వర్మ వద్దంటూ అర్షద్‌ బృందం నినాదాలు చేసింది. జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కుక్రూను అంబుడ్స్‌మన్‌గా నియమించాలని అర్షద్‌ సూచించాడు. ఈ ప్రతిపాదనకు శివలాల్‌యాదవ్‌ మద్దతు తెలిపాడని హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్‌ వేదిక మీద నుంచి ప్రకటించాడు. అయితే విజయానంద్‌ను అజహర్‌ వారించాడు. దీపక్‌వర్మకే అందరి మద్దతు ఉందని వెల్లడించాడు. ఈలోపు జస్టిస్‌ మీనాకుమారి పేరు తెరపైకి వచ్చింది. దీంతో సమావేశ మందిరంలో తీవ్ర గందరగోళం నెలకొంది. మాజీ టెస్టు ఆటగాళ్లు అర్షద్‌ అయూబ్‌, అజహర్‌లు తీవ్రస్థాయి దూషించుకున్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో సాగింది. "నువ్వు మ్యాచ్‌ ఫిక్సర్‌.. దేశాన్ని అమ్మేశావు" అంటూ అజ్జూను అర్షద్‌ విమర్శించాడు. "నువ్వు హెచ్‌సీఏను దోచుకున్నావు. నువ్వో దొంగ. నీ మోసాలన్నీ నాకు తెలుసు. ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి. నీ సంగతి తేలుస్తా" అంటూ అర్షద్‌ను అజ్జూ హెచ్చరించాడు. బీసీసీఐలో హెచ్‌సీఏకు తానే ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేశాడు. "ఏజీఎంలో మీ ప్రవర్తనపై బీసీసీఐ, హైకోర్టుకు ఫిర్యాదు చేస్తా. హెచ్‌సీఏకు పరిపాలకులను నియమించమని కోరతా" అంటూ అజహర్‌ ప్రకటించడం వల్ల అందరూ వెనక్కి తగ్గారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామంటూ రాజీకి వచ్చారు.

"అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ అధికారి పదవులకు న్యాయమూర్తులు దీపక్‌వర్మ, నిసార్‌ అహ్మద్‌ కుక్రూ, మీనాకుమారిల పేర్లను ప్రతిపాదించారు. రెండు పదవులకు మూడు పేర్లు వచ్చాయి. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏప్రిల్‌ 11కు ఏజీఎం వాయిదా పడింది. ఎవరిని నియమించాలన్నది ఆరోజు నిర్ణయిస్తాం. అవసరమైతే రహస్య ఓటింగ్‌ నిర్వహిస్తాం. సుదీప్‌ త్యాగి, స్రవంతి నాయుడు, డయానా డేవిడ్‌లను క్రికెల్‌ సలహా కమిటీ (సీఏసీ)కి ఎంపిక చేశాం" అని విజయానంద్‌ తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.