ETV Bharat / sports

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. ఈ విషయాలు తెలుసా? - గత సిరీస్ మ్యాజిక్​ను కోహ్లీసేన రిపీట్ చేస్తుందా?

ఆస్ట్రేలియా-భారత్ మధ్య టెస్టు సిరీస్​ గురువారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లలో ఎవరిది ఆధిపత్యమో గణాంకాల ద్వారా తెలుసుకుందాం.

AUSvsIND Test series
గత సిరీస్ మ్యాజిక్​ను కోహ్లీసేన రిపీట్ చేస్తుందా?
author img

By

Published : Dec 15, 2020, 5:48 PM IST

Updated : Dec 15, 2020, 7:00 PM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ అంటే వెంటనే గుర్తొచ్చేవి రెండే టోర్నీలు. ఒకటి యాషెస్‌, రెండోది బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ. ఈ రెండూ ఆ జట్టుకు ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఇంగ్లాండ్‌తో యాషెస్‌లో తలపడితే టీమ్‌ఇండియాతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ఆడుతుంది కంగారూల జట్టు. ఈ రెండు సిరీస్‌లు అటు క్రీడాకారులకే కాకుండా ఇటు అభిమానులకు కూడా ఎంతో మజానిస్తాయి. ఈ నేపథ్యంలోనే గురువారం నుంచి ఇరుజట్లూ మరోసారి తలపడేందుకు సిద్ధపడ్డాయి. ఈ సందర్భంగా సిరీస్​ గణాంకాలను ఓసారి చూద్దాం.

గత సిరీస్ మ్యాజిక్​ను కోహ్లీసేన రిపీట్ చేస్తుందా?

ఆస్ట్రేలియాపై మొదటి సిరీస్ విజయం

భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి సిరీస్​ 1947లో జరిగింది. ఈ సిరీస్​ను 0-4 తేడాతో చేజార్చుకుంది భారత్. తర్వాత 32 ఏళ్లకు 1979లో కంగారూలపై సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది టీమ్ఇండియా. ఆరు మ్యాచ్​ల సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొత్తంగా ఆసీస్​తో 98 టెస్టులు ఆడిన భారత జట్టు 28 మ్యాచ్​ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇందులో 27 డ్రాగా ముగిశాయి.

టెస్టు టైతో మరో రికార్డు

1986లో చెన్నై వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు టైగా ముగిసింది. 348 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ఇండియా 347 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. క్రికెట్ చరిత్రలో టెస్టు మ్యాచ్ టైగా ముగియడం ఇది రెండోసారి మాత్రమే. 1960లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా టై అయింది.

AUSvsIND Test series: Interesting stats from the rivalry
ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా గడ్డపై పేలవ రికార్డు

ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు 12 ద్వైపాక్షిక సిరీస్​లు జరిగాయి. ఇందులో ఎనిమిదింటిలో ఆసీస్ గెలవగా, మూడు డ్రాగా ముగిశాయి. గతేడాది (2018-19) కోహ్లీ సారథ్యంలో మొదటిసారి కంగారూల గడ్డపై సిరీస్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది భారత్. ఆసీస్​లో టెస్టు సిరీస్​ గెలిచిన తొలి ఆసియా జట్టు కూడా భారత్ కావడం విశేషం. మొత్తంగా అక్కడ ఆడిన 48 మ్యాచ్​ల్లో ఇండియా కేవలం ఏడు మ్యాచ్​ల్లోనే విజయం సాధించింది.

కోహ్లీ రికార్డు

ఆస్ట్రేలియాలో కోహ్లీకి మంచి రికార్డుంది. 2014-15 టెస్టు సిరీస్​లో ఇతడు ఏకంగా 692 పరుగులు చేశాడు. అప్పటివరకు ఆ రికార్డు ద్రవిడ్ (619) పేరిట ఉండేది. ఈ సిరీస్​లో నాలుగు సెంచరీలు కూడా బాదాడు కోహ్లీ. అలాగే ఇదే సిరీస్​లో ఆసీస్ బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్ 769 పరుగులతో బ్రాడ్​మన్ రికార్డును తిరగరాశాడు. బ్రాడ్​మన్ 1947లో 715 పరుగులు చేశాడు.

కోహ్లీ

బ్యాట్స్​మెన్-బౌలర్ ఫేస్ టూ ఫేస్

*టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీని టెస్టుల్లో నాలుగు సార్లు ఔట్ చేశాడు ప్యాట్ కమిన్స్. ఇతడి బౌలింగ్​లో 202 బంతులాడిన కోహ్లీ కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు.

*పుజారా.. జోష్ హెజిల్​వుడ్ బౌలింగ్​లో నాలుగు సార్లు ఔటయ్యాడు.

*అలాగే భారత పేసర్ ఉమేశ్ యాదవ్.. ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్​ను నాలుగు సార్లు ఔట్ చేశాడు.

ఇవీ చూడండి: మహేంద్రజాలం లేక టీమ్‌ఇండియా వెలవెల!

Last Updated : Dec 15, 2020, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.