2020 టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీకి భారత పర్యటకులను ఆకర్షించడానికి వచ్చే నెలలో రూ.34 లక్షల ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తామని ఆస్ట్రేలియా తెలిపింది. భారత ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ కొత్త ప్రచారం సహాయపడుతుందని ఆస్ట్రేలియా పర్యటక మంత్రి సైమన్ బర్మింగ్‌హామ్ అన్నారు.
"ఆస్ట్రేలియా పర్యటక రంగం ఇప్పటికే భారత పర్యటకులతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతి ఏడాదీ సుమారు 170 కోట్ల వ్యాపారం భారతీయుల వల్లనే జరుగుతోంది. మహిళ, పురుషుల టోర్నమెంట్లకు సందర్శకులను పెంచడానికి ఈ కొత్త ప్రచారం సహాయపడుతుంది". -సైమన్ బర్మింగ్‌హామ్
ప్రధాన క్రీడా కార్యక్రమాలు పర్యటక రంగంపై గొప్ప ప్రభావం చూపుతాయన్నాడు సైమన్. ప్రపంచ వ్యాప్తంగా 16 శాతం పర్యటకులు క్రీడా కార్యాక్రమాల కోసమే హాజరవుతారని తెలిపాడు.
క్రీడా రంగం ఏడాదికి 5 వేల కోట్లను ఆస్ట్రేలియాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందిస్తుందని అంచనా వేశారు. ఇవి దేశంలో పెట్టుబడులకు, అభివృద్ధికి తోడ్పడతాయని భావిస్తున్నారు.
భారత్ నుంచి 2035 నాటికి దాదాపు 12 లక్షల పర్యటకులు వస్తారని, ఇందుకు ఆ దేశంలో పర్యటక మార్కెట్ పెంచాల్సిన అవసరం ఉందన్నాడు సైమన్. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2020 ఇందుకు మినహాయింపు కాదని, దీనికి పది లక్షల మంది అభిమానులు వస్తారన్నాడు.
ఇది సంగతి: 'కెప్టెన్సీపై సమావేశం ఎందుకు జరగలేదు'