ETV Bharat / sports

భువీ, బుమ్రా వల్ల పీడకలలొచ్చేవి: ఫించ్​ - అరోన్ ఫించ్​

టీమిండియా పేసర్లు భువనేశ్వర్​ కుమార్​, బుమ్రా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు ఆస్ట్రేలియా క్రికెటర్​ ఆరోన్​ ఫించ్​. గతంలో వీరిద్దరి బౌలింగ్​లో ఔటవుతాననే భయంతో పీడకలలు వచ్చేవని చెప్పాడు.

Australia captain Aaron Finch
భువీ, బుమ్రా వల్ల పీడకలలొచ్చేవి: ఫించ్​
author img

By

Published : Mar 16, 2020, 6:12 AM IST

ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్​ ఆరోన్​ ఫించ్..​ 2018లో భారతతో ఆడిన పలు మ్యాచ్​ల గురించి తన అనుభవాన్ని భయపెట్టాడు. ఆ సమయంలో భువీ, బుమ్రా చేతిలో ఔటైతున్నట్లు పీడకలలొచ్చేవని చెప్పాడు. తాజాగా అమెజాన్​ విడుదల చేసిన డాక్యుమెంట్​ సిరీస్​ 'ద టెస్టు'లో ఇవన్నీ వెల్లడించాడు.

"అర్థరాత్రి సమయంలో నిద్ర పట్టక బుమ్రా బౌలింగ్​ను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించేవాడిని. బుమ్రా బౌలింగ్​ ఆడేందుకు భయమేసేది. అవన్నీ ఆలోచించి పడుకుంటే ఉదయం నిద్ర లేవగానే ఒళ్లంతా చెమటలు పట్టేసేవి. బుమ్రా, భువీ బౌలింగ్​లో చాలా ఫన్నీగా ఔటవుతుంటే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు."

- ఆరోన్​ ఫించ్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

నాలుగు సార్లు భువీ చేతిలోనే..

ఆ పర్యటనలో మూడు ఫార్మాట్లలో ఫించ్​ విఫలమయ్యాడు. ఎక్కువగా భువీ ఇన్​ స్వింగర్లకు పెవిలియన్​ చేరేవాడు. ఒక్క ఈ సిరీస్​లోనే భువీ బౌలింగ్​లో ఆరు మ్యాచ్​ల్లో నాలుగు సార్లు(3 వన్డేలు, ఒక్క టీ20) ఔటయ్యాడు. బోర్డర్​ గావస్కర్​ టెస్టు సిరీస్​లో ఆసీస్​తో తలపడిన భారత్..​. 3-1 తేడాతో ట్రోఫీ సొంతం చేసుకుంది. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సిరీస్​ గెలవడం బాగా చర్చనీయాంశమైంది. అంతే కాకుండా వన్డే సిరీస్​ను 2-1 తేడాతో గెలిచిన భారత్​... టీ20 సిరీస్​ను 1-1 తేడాతో డ్రా చేసుకుంది. బుమ్రా నాలుగు మ్యాచ్​ల్లో 21 వికెట్లు తీశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.