ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయడంలో లంక దిగ్గజం మురళీధరన్‌ను అధిగమించాడు. ఆసీస్ ఆటగాడు హేజిల్‌వుడ్ వికెట్‌తో అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 5 వికెట్లు తీశాడు.
అంతకు ముందు టెస్టుల్లో 191 మంది లెఫ్ట్-హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసిన రికార్డు మురళీధరన్ పేరిట ఉంది. ఈ మార్క్‌ను అశ్విన్ 73 ఇన్నింగ్స్‌లోనే దాటేశాడు.
ఈ జాబితాలో అశ్విన్ (192), మురళీధరన్ (191), ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (186), ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్లు గ్లెన్ మెక్‌గ్రాత్ (172), షేన్ వార్న్ (172), టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (167) ఉన్నారు.
బాక్సింగ్ డే టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. భారత జట్టు కెప్టెన్ రహానె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ఇదీ చూడండి: రహానె వచ్చాక డ్రస్సింగ్ రూమ్‌లో అలా: అశ్విన్