మహ్మద్ ఆమిర్.. పాకిస్థాన్ బౌలింగ్ విభాగంలో ప్రధాన పేసర్. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా కొంత కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ యువ బౌలర్ పునరాగమనం తర్వాత సత్తాచాటాడు. ప్రపంచకప్‌లోనూ ఆకట్టుకున్న ఆమిర్ అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయంపై పాకిస్థాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ స్పందించాడు. టెస్టులకు వీడ్కోలు పలుకుతూ ఆమిర్ తీసుకున్న నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని తెలిపాడు.
"ఆమిర్‌ను ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడించటానికి ప్రయత్నించాం. అతను మంచి బౌలర్ అని నమ్మి అవకాశాలు కల్పించాం. స్పాట్ ఫిక్సింగ్ వల్ల ఆమిర్ ఐదేళ్లు క్రికెట్‌కు దూరమయ్యాడు. లేకపోతే టెస్టుల్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచేవాడు. నిషేధానికి ముందు అతడు మంచి బౌలర్. ప్రస్తుతం ఆమిర్ శరీరం సహకరించట్లేదు. అతని ఆలోచనలకు విలువిచ్చి అయిష్టంగానే ఈ నిర్ణయాన్ని అంగీకరించా. ఆమిర్ ఏది చెయ్యాలనుకున్నాడో అదే తనకు ఉత్తమం అని నమ్మాను."
-మిక్కీ ఆర్థర్, పాక్ కోచ్
2010లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు ఆమిర్ ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. గడువు పూర్తయ్యాక 2015లో తిరిగొచ్చి అన్ని ఫార్మాట్లకు ఆడాడు. 36 టెస్టుల్లో 119 వికెట్లు తీశాడు.
ఆమిర్‌పై పనిభారాన్ని తగ్గించడానికి ప్రయత్నించామన్నాడు ఆర్థర్. 2019 ప్రపంచకప్‌లోనూ 17 వికెట్లు తీసి సత్తాచాటాడని చెప్పాడు. ఒక వ్యక్తిగా, క్రికెటర్‌గా అతడిపై గౌరవముందని తెలిపాడు పాక్ కోచ్.
ఇది సంగతి: నెయ్‌మర్‌పై అత్యాచార ఆరోపణల కేసు మూసివేత